Chiranjeevi: మెగాస్టార్‌ ఇంట అందరూ మహాలక్ష్ములే.. చిరంజీవికి మొత్తం ఎంతమంది మనవరాళ్లు ఉన్నారో తెలుసా?

మెగాస్టార్‌ చిరంజీవి ఇంట మరో వారసురాలు అడుగుపెట్టింది. రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన మంగళవారం తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా పెళ్లైన సుమారు 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్‌- ఉపాసన తల్లిదండ్రులు కావడం విశేషం. దీంతో మెగా ఫ్యామిలీ ఇంట పండగ వాతావరణం నెలకొంది.

Chiranjeevi: మెగాస్టార్‌ ఇంట అందరూ మహాలక్ష్ములే.. చిరంజీవికి మొత్తం ఎంతమంది మనవరాళ్లు ఉన్నారో తెలుసా?
Chiranjeevi Family
Follow us
Basha Shek

|

Updated on: Jun 21, 2023 | 6:43 AM

మెగాస్టార్‌ చిరంజీవి ఇంట మరో వారసురాలు అడుగుపెట్టింది. రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన మంగళవారం తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా పెళ్లైన సుమారు 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్‌- ఉపాసన తల్లిదండ్రులు కావడం విశేషం. దీంతో మెగా ఫ్యామిలీ ఇంట పండగ వాతావరణం నెలకొంది. మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా మెగా ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మంగళవారం తెల్లవారుజామున రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మరోసారి తాతగా ప్రమోషన్‌ పొందారు చిరంజీవి. తమకెంతో ఇష్టమైన మంగళవారం రోజు మహాలక్ష్మి పుట్టడం ఎంతో సంతోషంగా ఉందని మురిసిపోయారు.

కాగా మెగాస్టార్‌ చిరంజీవికి ఇప్పటికే నలుగురు మనవరాళ్లు ఉన్నారు. రామ్‌ చరణ్ కూతురు రాకతో ఆ సంఖ్య కాస్తా ఐదుకు చేరింది.మెగాస్టార్‌కు మొత్తం ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కుమార్తె సుస్మిత సమర, సంహిత అనే ఇద్దరు ఆడపిల్లలన్నారు. ఇక చిన్న కూతురు శ్రీజకు కూడా ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నివృతి పుట్టాక భర్తతో విడిపోయిన శ్రీజ కల్యాణ్‌ దేవ్‌ని వివాహం చేసుకుంది. వీరికి నవిష్క జన్మించింది. ఇలా చిరంజీవి ఇద్దరి కుమార్తెలకి ఇద్దరు కూతుళ్లు చొప్పున మొత్తం నలుగురు మహాలక్ష్ములే పుట్టారు. ఇక ఇప్పుడు రామ్‌ చరణ్‌-ఉపాసన జంట కూడా ఓ ఆడబిడ్డకే జన్మనివ్వడంతో చిరంజీవి ఇంట మొత్తం ఐదుగురు మనువరాళ్లు అడుగుపెట్టినట్లయ్యింది. మొత్తానికి మహాలక్ష్ములతో మెగాస్టార్‌ ఫ్యామిలీ కళకళలాడుతోందని అభిమానులు, నెటిజన్లు మురిసిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.