ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ఏది అంటే టక్కున చెప్పే పేరు ఆది. వివినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఆది సినిమాలో జూ.ఎన్టీఆర్ కు జోడీగా కీర్తి చావ్లా హీరోయిన్ గా నటించింది. 2002 లో వచ్చిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ మూవీ భారీ హిట్ గా నిలిచింది. ఆది సినిమా మార్చి 28, 2002న విడుదలైంది. సినిమా భారీ విజయాన్ని సాధించింది. అంతేకాక జూనియర్ ఎన్టీఆర్ కి గొప్ప స్టార్ డం సంపాదించిపెట్టింది. మొదటి సినిమాతోనే వి.వి.వినాయక్ స్టార్ డైరెక్టర్ గా పేరుపొందారు. ఇక ఈ సినిమాలోని డైలాగులు , సాంగ్స్ ఇప్పటికి వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి చావ్లా గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో అని సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ గాలిస్తున్నారు.
ఆది తర్వాత కీర్తి చావ్లా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. తెలుగు చిత్రాలతోపాటు కన్నడ, తమిళ చిత్రాలలో కూడా నటించింది. కీర్తి చావ్లా చివరిగా 2012లో చోరీ అనే సినిమాలో నటించింది. ఆతర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరం అయ్యింది. తెలుగులో కాశీ, శ్రావణ మాసం, ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు, సాధ్యం, బ్రోకర్ సినిమాల్లో నటించింది.
అయితే ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉంది ఎక్కడ ఉంది అన్నది తెలుసుకోవడానికి నెటిజన్స్ గూగుల్‌ను గాలిస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్‌లో కీర్తి చావ్లా పేరుతో ఓ అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ లో కీర్తి చావ్లాకు సంబందించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తున్నారు. అందులో కీర్తి లేటెస్ట్ వీడియోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అప్పటికి ఇప్పటికి ఆమె చాలా మారిపోయింది. చాలా మంది ఆమెను గుర్తుపట్టలేకపోతున్నారు. లుక్ మారినా కీర్తి అందం మాత్రం తగ్గలేదు. కీర్తికి సంబందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.