AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HIT 3 Movie: హిట్ 3 మూవీ విలన్ ఆ స్టార్ హీరోయిన్ కొడుకా.. ? బిడ్డ పుట్టిన రెండు వారాలకే..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లతో దూసుకుపోతున్న సినిమా హిట్ 3. న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇందులో నటించిన విలన్ ఎవరో తెలుసా.. ? ఇప్పుడు ఆ నటుడి గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు తెలుగు అడియన్స్.

HIT 3 Movie: హిట్ 3 మూవీ విలన్ ఆ స్టార్ హీరోయిన్ కొడుకా.. ? బిడ్డ పుట్టిన రెండు వారాలకే..
Hit 3
Rajitha Chanti
|

Updated on: May 09, 2025 | 10:08 AM

Share

న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్లో వచ్చిన లేటేస్ట్ మూవీ హిట్ 3. మే 1న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రానికి రోజు రోజుకి మరింత ఆదరణ లభిస్తుంది. ఇందులో నాని సరసన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన హిట్ 1, 2 చిత్రాలకు సీక్వెల్ గా వచ్చింది. ఇక త్వరలోనే హిట్ 3 సినిమాకు మరో సీక్వెల్ రాబోతుంది. ఇదంతా పక్కన పెడితే.. హిట్ 3 చిత్రంలో విలన్ పాత్రలో కనిపించిన నటుడు గుర్తున్నాడా.. ? ఇందులో ఆల్ఫా పాత్రలో నటించి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. ఈ నటుడి పేరు ప్రతీక్ బాబర్.. హిట్ 3 సినిమాతో ఇప్పుడు తెలుగు సినీరంగంలో బాగా పాపులర్ అయ్యాడు. కానీ అంతకు ముందే హిందీలో అనేక చిత్రాల్లో నటించాడు.

ప్రతీక్ బాబర్.. ఇప్పటివరకు హిందీలో దాదాపు 30 సినిమాల్లో నటించారు. సికందర్, దర్భార్, భాగీ 2 వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రతీక్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడని చాలా మందికి తెలియదు. అతడు ఒకప్పటి స్టార్ హీరోయిన్ కుమారుడు. ఆమె మరెవరో కాదు.. చిన్న వయసులోనే ఉత్తమ నటిగా రెండు జాతీయ అవార్డ్స్ అందుకున్న స్మితా పాటిల్. హిందీలో దాదాపు 80కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె.. కేవలం 31 ఏళ్ల వయసులోనే మరణించింది.

గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కథ, పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం ఎదురుచూసేవారు. ఎలాంటి గ్లామర్ షో చేయకుండా.. అద్భుతమైన నటనతో దాదాపు దశాబ్ద కాలం సినీరంగంలో చక్రం తిప్పింది. అప్పట్లో ఆమె యువత కలల రాకూమారి. 1987లో మిర్చ్ మసాలా అనే సినిమాలో ఆమె నటనను ఫోర్బ్స్ పత్రిక భారత సినిమాలలో 25 అత్యున్నత నట ప్రదర్శనల జాబితాలో చేర్చింది. 1985లో పద్మ శ్రీ పురస్కారం అందుకుంది స్మితా పాటిల్. సినీ నటుడు రాబ్ బబ్బర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది స్మితా పాటిల్. ఆ తర్వాత ప్రతీక్ బబ్బర్ జన్మించిన రెండు వారాలకే అనారోగ్య సమస్యలతో 1986 డిసెంబర్ 13న కన్నుమూసింది. ఇప్పుడు ప్రతీక్ బబ్బర్ హిందీ, తెలుగు సినిమాల్లో రాణిస్తున్నాడు.

View this post on Instagram

A post shared by prateik smita patil (@_prat)

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..