AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒక్క సినిమాతోనే శ్రీదేవి స్టార్ డమ్‏ను షేక్ చేసిన హీరోయిన్.. చివరకు ఇండస్ట్రీలో అలా.. ఇప్పుడేం చేస్తుందంటే..

శ్రీదేవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 90'sలో భారతీయ సినీ పరిశ్రమను ఏలేసింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీ భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ మీకు తెలుసా.. ? శ్రీదేవికే పోటీ ఇచ్చిన హీరోయిన్ ఎవరో.. ఒక్క సినిమాతోనే శ్రీదేవి స్టార్ డమ్ షేక్ చేసింది. ఆమె ఎవరంటే..

Tollywood: ఒక్క సినిమాతోనే శ్రీదేవి స్టార్ డమ్‏ను షేక్ చేసిన హీరోయిన్.. చివరకు ఇండస్ట్రీలో అలా.. ఇప్పుడేం చేస్తుందంటే..
Sridevi
Rajitha Chanti
|

Updated on: Jun 02, 2025 | 8:19 AM

Share

సినీరంగంలో నటిగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కానీ కొందరు మాత్రం ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిపోతారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. అప్పట్లో హీరోయిన్ శ్రీదేవికే గట్టిపోటీ ఇచ్చింది. కేవలం ఒక్క మూవీతోనే శ్రీదేవి స్టార్ డమ్ షేక్ చేసింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు అంతగా మెప్పించలేదు. అలాగే అదే సమయంలో భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తక్కువ సమయంలోనే సినిమాలకు దూరమయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. మధు.. అలియాస్ మధుబాల. తెలుగు, తమిళం ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్. రోజా సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

తమిళం, తెలుగులో వరుస సినిమాల్లో నటించిన మధు.. ఫూల్ ఔర్ కాంటే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో హీరో అజయ్ దేవగన్ సైతం తెరంగేట్రం చేశారు. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత 3 రోజులు మధు తన స్నేహితురాలి ఇంట్లో దాక్కుందట. ఎందుకంటే అదే సమయంలో యష్ చోప్రా తెరకెక్కించిన లమ్హే మూవీ సైతం విడుదలైంది. యష్ చోప్రా సినిమా అంటే పక్కా హిట్టు గ్యారెంటీ. అందులో అనిల్ కపూర్, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించారు. ఆ సమయంలో మధు చాలా భయపడ్డారట. అప్పటికే శ్రీదేవి, అనిల్ కపూర్ ఇద్దరూ స్టార్ స్టేటస్ కలిగిన నటీనటులు.. వారిద్దరి సినిమాతోపాటు కొత్తవారైన తమ సినిమా విడుదల కావడంతో అసలు ఎవరైనా చూస్తారా ? అనే సందేహాలు కలిగియట మధుకు.

దీంతో భయంతో తన స్నేహితురాలి ఇంట్లో 3 రోజులు దాక్కుందట. కానీ ఫూల్ ఔర్ కాంటే చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. తన సన్నిహితులు విషయం చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మధు. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది మధు. కానీ ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేదు. అలాగే అదే సమయంలో ఆమె ఎక్కువగా పారితోషికం డిమాండ్ చేయడంతో ఆఫర్స్ తగ్గిపోయానని సమాచారం. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న మధు.. అంతే త్వరగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న మధు.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?