Sathyaraj: బాహుబలి ‘కట్టప్ప’ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా ? నెట్టింటిని షేక్ చేస్తోందిగా..

ముఖ్యంగా ఆయన కూతురు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

Sathyaraj: బాహుబలి 'కట్టప్ప' కూతురు ఎంత అందంగా ఉందో చూశారా ? నెట్టింటిని షేక్ చేస్తోందిగా..
Sathyraj
Follow us
Rajitha Chanti

| Edited By: Anil kumar poka

Updated on: Feb 23, 2023 | 1:55 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో సహజ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సత్యరాజ్. తెలుగులోనే కాకుండా తమిళంతోపాటు పలు భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇందులో సత్యరాజ్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉండే సత్యరాజ్ కుటుంబానికి సంబంధించిన విషయాలు చాలా అరుదుగా బయటకు వస్తుంటాయి. ముఖ్యంగా ఆయన కూతురు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

సత్యరాజ్ సతీమణి పేరు మహేశ్వరి. ఇక కట్టప్ప దంపతులకు ఒక కుమారుడు.. కూతురు ఉన్నారు. కొడుకు సిబిరాజ్ ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. డోరా, మాయోన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక కూతురు దివ్య సత్యరాజ్ అభిమానులకు అంతగా తెలియదు. ఎందుకంటే ఆమె బయట ఎక్కువగా కనిపించదు. ఆమె న్యూట్రిషనిస్ట్.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం న్యూట్రిషనిస్ట్ గా కెరీర్ కొనసాగిస్తుంది. ఇన్ స్టా వేదికగా తరచూ ఆరోగ్యం, ఆహారపు అలవాట్ల గురించి సలహాలు, సూచనలు ఇస్తుంది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. దీంతో ఆమె అచ్చం హీరోయిన్స్ లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.