AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఒక్క వీడియోతో కెరీర్ నాశనం.. ఇప్పుడేం చేస్తుందంటే..

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్. అప్పట్లో ఆమె కుర్రాళ్ల ఆరాధ్య దేవత. అందం, అభినయంతో వెండితెరపై మ్యాజిక్ చేసింది. కానీ ఒకే ఒక్క వీడియోతో ఆమె కెరీర్ నాశనమైంది. చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇంతకీ ఈ భామ గుర్తుందా .. ?

Tollywood : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఒక్క వీడియోతో కెరీర్ నాశనం.. ఇప్పుడేం చేస్తుందంటే..
Riya Sen
Rajitha Chanti
|

Updated on: Aug 08, 2025 | 5:54 PM

Share

సినీరంగంలో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ దూసుకుపోతుంటారు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే చేసిన చిన్న పొరపాట్లతో ఊహించని రీతిలో ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్.. అప్పట్లో కుర్రాళ్లను ఆగం చేసింది. గ్లామర్ బ్యూటీగా యూత్ ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు, హిందీ, తమిళం భాషలలో నటించినప్పటికీ విజయం సాధించలేకపోయింది. సినిమాల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోలేకపోయింది. ఒక్క వీడియోతో ఆమె కెరీర్ నాశనమైంది. ఇంతకీ ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ? ఆమె పేరు రియా సేన్.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..

ఇవి కూడా చదవండి

1999లో విడుదలైన భారతీరాజా దర్శకత్వం వహించిన ‘తాజ్ మహల్’ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. అప్పుడు ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు ఆమెకు 44 ఏళ్లు. దాదాపు 25 సంవత్సరాల క్రితం రియా సేన్ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. కానీ అంతగా విజయం సాధించలేకపోయింది. అంతేకాదు.. ఈ నటి తల్లి, అమ్మమ్మ ఇద్దరూ హీరోయిన్లు కావడం విశేషం. ఇక ఆమె తండ్రి భరత్ దేవ్ వర్మ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. తల్లి పేరు మున్మున్ సేన్, అమ్మమ్మ సుజిత్రా సేన్. ఇక రియా సేన్ సోదరి రైమా సేన్ బెంగాలీలో నటి.

ఇవి కూడా చదవండి :  Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?

తాజ్ మహల్ సినిమా తర్వాత కోలీవుడ్ హీరో ప్రశాంత్ సరసన గుడ్ లక్ చిత్రంలో కనిపించింది. దాదాపు 12 చిత్రాల్లో నటిస్తే.. అన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయితే 2005లో ఆమె తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న వీడియో లీక్ కావడంతో ఒక్కసారిగా రియా సేన్ వార్తలలో నిలిచింది. ఆ వీడియో నకిలీదని ఖండించారు. కానీ ఆ తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. 2016లో విడుదలైన ‘డార్క్ చాక్లెట్’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..

అంతేకాదు.. ఆమె జాన్ అబ్రహంతో ప్రేమలో ఉందనే రూమర్స్ సైతం వినిపించాయి. అలాగే ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోలతో ఆమె ప్రేమాయణం.. క్రికెటర్స్ తోనూ డేటింగ్ చేసిందని టాక్ నడించింది. ఇప్పుడు రియా సేన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?

View this post on Instagram

A post shared by Riya Senn T (@riyasendv)

ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..