
సాధారణంగా సినీ పరిశ్రమలో సినిమా స్టోరీస్ రాసేటప్పుడు, రచయితలు కూడా ప్రత్యేకంగా ఒక హీరోని దృష్టిలో ఉంచుకుంటారు. కానీ కొన్నిసార్లు తారలు ఈ కథలను చేసేందుకు అంతగా సుముఖత చూపించరు. కథ విన్న వెంటనే సినిమాను తిరస్కరిస్తారు. ఈ సినిమా విషయంలో కూడా అలాంటిదే జరిగింది. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈచిత్రాన్ని చేసేందుకు ఏ హీరో ముందుకు రాలేదు. ఒకరు లేదా ఇద్దరు కాదు, దాదాపు 12 మంది హీరోలు ఆ మూవీ స్టోరీని తిరస్కరించారు. 12 మంది హీరోలు దానిని తిరస్కరించిన తర్వాత కోలీవుడ్ కు సంబంధించిన ఓ హీరో ఈసినిమాను చేశారు. కట్ చేస్తే.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ తిరగరాసింది.
ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..
ఈ సినిమా పేరు ‘గజిని’. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం 2005 లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే సూర్యకు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఇందులో సూర్య ‘సంజయ్ రామస్వామి’ పాత్రకు ప్రాణం పోశాడు. డైరెక్టర్ A.R. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అసిన్ హీరోయిన్ గా నటించింది. మీకు తెలుసా.. ? సూర్య కంటే ముందు సినిమాను దాదాపు 12 మంది హీరోలు తిరస్కరించారు. A.R. మురుగదాస్ ఈ కథను మొదట మహేష్ బాబుకి చెప్పాడు. కానీ మహేష్ ఆ కథను తిరస్కరించాడు ఎందుకంటే హీరో తన శరీరమంతా టాటూలు వేయించుకున్నాడు, ప్రేక్షకులు దానిని అంగీకరించరని మహేష్ భావించారు. ఆ తర్వాత ఈ కథను పవన్ కళ్యాణ్ కు చెప్పగా, అక్కడ కూడా అదే స్పందన వచ్చింది. ఆ తర్వాత తమిళ హీరో కమల్ హాసన్, విజయకాంత్, రజనీకాంత్, దళపతి విజయ్, అజిత్ సహా దాదాపు 12 మంది హీరోలకు కథను చెప్పగా, ఎవరూ ఆ సినిమా చేయడానికి అంగీకరించలేదు.
ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?
నిజానికి ఆ సినిమా అజిత్ తో మొదలైంది. రెండు షెడ్యూల్స్ తర్వాత సినిమా ఆగిపోయింది. ఒకానొక సమయంలో మురుగదాస్ కథను వదిలేసి మరో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ కథను అసంపూర్ణంగా వదిలేయకూడదనే ఉద్దేశ్యంతో, చివరి ప్రయత్నంగా సూర్యకి కథను వివరించాడు. సూర్య వెంటనే మరో ఆలోచన లేకుండా ‘సరే’ అన్నాడు. ఆ తర్వాత షూటింగ్ కూడా వేగంగా ప్రారంభమైంది. ఆ సినిమా ఏడాదిలోనే విడుదలై రికార్డులు బద్దలు కొట్టింది. అల్లు అరవింద్ దీన్ని తెలుగులో విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..