Tollywood: చిన్నప్పుడే స్టేజిపై మెడల్.. ఇప్పుడేమో అందాలతో హార్ట్ ఎటాక్.. ఎవరీ బ్యూటీ.?
ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు.. మొన్నీమధ్యే యాక్సిడెంట్ నుంచి కోలుకొని వరుస సినిమాలు చేస్తోంది. అంతకముందు కన్నడ ఇండస్ట్రీతో పరిచయమై.. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయింది. చిన్నప్పుడు మెడల్ అందుకున్న ఈ భామ.. ఇప్పుడు అందంతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోంది.

పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? చిన్నప్పుడే స్టేజిపై మెడల్స్, ట్రోఫీలు అందుకుంది. అన్ని ఈవెంట్స్‌లోనూ తానే ఫస్ట్ ఉంది. అవార్డులు, రివార్డులు సాధించింది. ఇక ఇప్పుడేమో తన అందాలతో కుర్రకారుకు లైట్ హార్ట్ ఎటాక్స్ ఇస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.? లేదా మీకో క్లూ ఇస్తున్నాం. ఫస్ట్ కన్నడ ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత టాలీవుడ్‌లో సెటిల్ అయింది. ఇప్పటికే ఆమె ఎవరో అర్థమైందా.? అదేనండీ.! ‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ..
హా.! ఎస్.. మీ గెస్ కరెక్ట్.. ఆమే నభా నటేష్. కన్నడ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత తెలుగు చిత్రసీమలో సెటిల్ అయింది. ప్రస్తుతం హీరో నిఖిల్‌తో ప్యాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’లో నటిస్తోంది. కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు.. బెంగళూరులో తన మోడలింగ్ కెరీర్ ప్రారంభించి.. అప్పుడప్పుడూ వీధి నాటకాలు ప్రదర్శించింది. ఇక ఆ అనుభవంతో సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ప్రయత్నించింది. ఆ సమయంలోనే కన్నడంలో శివరాజ్‌కుమార్ సరసన ‘వజ్రకాయ’ అనే సినిమాలో నటించే అవకాశం దక్కింది. మూడు నెలల పాటు నటనలో శిక్షణ తీసుకుని ఆ సినిమా చేసింది. అందులో గుప్పు.. గుప్పుమంటూ బీడీలు కాల్చింది ఈ భామ. ఆ తర్వాత 2017లో ‘లీ’ అనే కన్నడ సినిమా చేసిన ఈమెకు.. 2018లో వరుసగా రెండు తెలుగు సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కింది.
తెలుగులో నభా నటేష్ మొదటి సినిమా ‘అదుగో’. కానీ ఈ చిత్రం కంటే ముందు సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ రిలీజైంది. ఈ మూవీ సక్సెస్ సాధించడంతో.. వరుసగా అవకాశాలు నభా తలుపు తట్టాయి. ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతుకే సో బెటర్, మాస్ట్రో వంటి చిత్రాలలో గ్లామరస్ రోల్స్‌లో నటించి తన నటనతోనూ మంచి మార్కులు సంపాదించింది. ఇక ఈ మధ్యే ‘డార్లింగ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం స్వయంభు మూవీలో నటిస్తోంది.. ఈ ముద్దుగుమ్మ.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




