Salaar Part 1 : సలార్ ప్రమోషన్స్‌కు జక్కన్న సాయం.. ప్రభాస్‌ను ఇంటర్వ్యూ చేయనున్న రాజమౌళి

బాహుబలి సినిమాలతో ప్రభాస్‌కు భారీ విజయాన్ని అందించిన ఘనత రాజమౌళిదే. అందుకే ప్రభాస్ కు రాజమౌళి అంటే ప్రత్యేక గౌరవం. రాజమౌళి ప్రభాస్‌ని తన క్లోజ్ ఫ్రెండ్‌గా భావిస్తాడు. ఇప్పుడు ప్రభాస్ నటించిన 'సలార్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్‌లో కూడా రాజమౌళి పాల్గొననున్నారు. ఇది విన్న అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. 

Salaar Part 1 : సలార్ ప్రమోషన్స్‌కు జక్కన్న సాయం.. ప్రభాస్‌ను ఇంటర్వ్యూ చేయనున్న రాజమౌళి
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 14, 2023 | 9:19 AM

దర్శకుడు రాజమౌళి, ప్రభాస్ మధ్య మంచి అనుబంధం ఉందన్న విషయం తెలిసిందే.. ఇద్దరూ కలిసి ఛత్రపతి ‘బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు చేసిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమాలతో ప్రభాస్‌కు భారీ విజయాన్ని అందించిన ఘనత రాజమౌళిదే. అందుకే ప్రభాస్ కు రాజమౌళి అంటే ప్రత్యేక గౌరవం. రాజమౌళి ప్రభాస్‌ని తన క్లోజ్ ఫ్రెండ్‌గా భావిస్తాడు. ఇప్పుడు ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్‌లో కూడా రాజమౌళి పాల్గొననున్నారు. ఇది విన్న అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు.

ప్రభాస్ నటించిన ‘బాహుబలి 2’ విడుదలై చాలా ఏళ్లు గడిచాయి. ఆ తర్వాత ఆయన నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఏ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోలేదు. దాంతో ప్రభాస్ నుంచి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ‘సలార్’తో ఎలాగైనా  హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నాడు ప్రభాస్. సలార్ సినిమా రిలీజ్ కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. దాంతో ఈ సినిమా పై ఆసక్తి రెట్టింపైంది.  ఇదిలా ఉంటే ఇప్పుడు సలార్ సినిమాకు రాజమౌళి సపోర్ట్ చేస్తున్నాడు. రాజమౌళి తన స్నేహితుడి సినిమా ప్రమోషన్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చారని తెలుస్తోంది.

ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌లను రాజమౌళి ఇంటర్వ్యూ చేయనున్నారు. దీన్ని యూట్యూబ్‌లో షేర్ చేయాలని హోంబలే ఫిల్మ్స్ నిర్ణయించింది. ఇక ఈ ఇంటర్వ్యూలో సలార్ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో రాజమౌళి ‘రాధే శ్యామ్’ విడుదల సందర్భంగా ప్రభాస్‌ను ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ‘సలార్‌’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే చిత్ర బృందం ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ చేయడం లేదని అభిమానులు ఆరోపిస్తున్నారు. ‘హోంబాలే ఫిలింస్’ ద్వారా భారీ బడ్జెట్‌తో రెడీ అవుతున్న ఈ చిత్రాన్ని విజయ్ కిరగందురు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ తోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు తదితరులు నటించారు. డిసెంబర్ 22న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.