Animal: “ఆ రేప్ సీన్ లేకపోతే సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు” : బాబీ డియోల్

ఈ సినిమా పై మొదట్లో చాలా విమర్శలు వచ్చాయి.. ఎక్కువ హింస, మహిళల పై అఘాయిత్యాలు చుపించారంటూ కొంతమంది విమర్శలు చేశారు. కానీ ఈ సినిమా మాత్రం ఇప్పుడు భారీవిజయం సొంతం చేసుకుంది. అంతే కాదు కలెక్షన్స్ పరంగానూ దూసుకుపోతోంది ఈ సినిమా. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద యానిమల్ సినిమా 500 కోట్లకు చేరువవుతోంది.

Animal: ఆ రేప్ సీన్ లేకపోతే సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు : బాబీ డియోల్
Bobby Deol
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 14, 2023 | 8:47 AM

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పై మొదట్లో చాలా విమర్శలు వచ్చాయి.. ఎక్కువ హింస, మహిళల పై అఘాయిత్యాలు చుపించారంటూ కొంతమంది విమర్శలు చేశారు. కానీ ఈ సినిమా మాత్రం ఇప్పుడు భారీవిజయం సొంతం చేసుకుంది. అంతే కాదు కలెక్షన్స్ పరంగానూ దూసుకుపోతోంది ఈ సినిమా. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద యానిమల్ సినిమా 500 కోట్లకు చేరువవుతోంది. వరల్డ్ వైడ్ గా ఏకంగా 1000 కోట్లకు పరుగులు పెడుతోంది యానిమల్. ఇక యానిమల్ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటించాడు.

బాబీ డియోల్ క్యారెక్టర్ ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చాలా డిఫరెంట్ గా క్రియేట్ చేశాడు. ఈ సినిమాలో బాబీ డియోల్ నటించిన ఓ సన్నివేశం పై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఓ అత్యాచారానికి సంబంధించిన సన్నివేశం అది. తాజాగా ఆ సన్నివేశం పై బాబీ డియోల్ మాట్లాడుతూ .. ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆ సీన్ లేకుంటే సినిమా అంత పెద్ద హిట్ అయ్యేది కాదు అన్నాడు బాబీ.

యానిమల్ సినిమాలో బాబీ డియోల్ తన పెళ్లి వేదిక పై పెళ్లి కూతురిని రేప్ చేసే సీన్ చూపించారు. ఆతర్వాత తన ఇద్దరు భార్యలను కూడా బలవంతగా అనుభవించడానికి రమ్మనడం చూపించారు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. ఈ విషయం పై బాబీ స్పందిస్తూ.. ఆ సీన్ లేకుంటే సినిమా అంత పెద్ద హిట్ అయ్యేది కాదు. ఇలాంటివాటిని నేను కూడా ప్రోత్సహించను..కానీ సినిమా విలన్ క్యారెక్టరైజేషన్ చెప్పడానికి ఉన్న తక్కువ సమయంలో అలాంటి సీన్ ఉపయోగపడింది అని అన్నాడు. విల‌న్ పాత్ర‌ను ఎస్టాబ్లిష్ చేయ‌డానికి ఆ సీన్ చేయక తప్పలేదు అని చెప్పుకొచ్చాడు బాబీ డియోల్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా