Hyderabad: చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు.. లోపల కనిపించింది చూడగా కళ్లు బైర్లు

Hyderabad: చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు.. లోపల కనిపించింది చూడగా కళ్లు బైర్లు

Ravi Kiran

|

Updated on: Dec 18, 2024 | 8:50 PM

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో జల్సాలకు అలవాటు పడి జైలు పాలై.. జైల్లో పరిచయమైన ఐదుగురు పాత నేరస్థులు ముఠాగా ఏర్పడి హైదరాబాద్‌లో గంజాయి దందా చేసేందుకు ఒడిశా నుండి గంజాయి తెస్తున్న ఐదుగురు యువకులను అరెస్ట్ చేసిన సౌత్ ఈస్ట్ జోన్ పోలీసులు. 30కిలోల గంజాయి, ఒక కారు..

30 కేజీల గంజాయిని మలక్‌పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేసి కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. గడ్డి అన్నారం చౌరస్తా వద్ద సోమవారం సాయంత్రం ఎస్ఐ నవీన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న బోలోరో కారును తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది.

మోత్కూర్‌కు చెందిన ఇక్కిరి భాస్కర్, వల్లందాసు వంశీ, బోయిని వంశీ, పొడిచేడుకు చెందిన జిట్టా కిరణ్, మహబూబ్‌నగర్ జిల్లా వెల్లంపల్లి గ్రామానికి చెందిన అల భారత్ కుమార్ రెడ్డిలను అరెస్ట్‌ చేశారు. కారులో ఉన్న 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కారును, ఎస్కార్ట్ బైక్‌ను సీజ్‌ చేశారు. వీరిపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి కేసులు నమోదయ్యాయని తెలిపారు. జైలులో వీరంతా కలిసి ముఠాగా ఏర్పడి బయటకు వచ్చాక వరుసగా గంజాయి సరఫరా చేస్తున్నారని సౌత్ ఈస్ట్ అదనపు డిసిపి స్వామి వివరించారు. ఒడిశా నుంచి గంజాయి తెస్తూ ధూల్‌పేటలో సరఫరా చేస్తున్నారని తెలిపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Published on: Dec 18, 2024 08:49 PM