Telangana: గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
ఆ రైతుకు ఓ గోశాల ఉంది. అలాగే కొన్ని కోళ్లు కూడా ఉన్నాయి. అయితే ఒక రోజు మూడు కోళ్లు మిస్సింగ్ అయ్యేసరికి.. ఏమై ఉంటుందా అని అటుగా వెళ్లి చేశారు. ఇక అక్కడ కనిపించిన సీన్ చూసేసరికి దెబ్బకు షాక్ అయ్యాడు. ఇది మన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని శివలింగపూర్ గ్రామంలో కొండచిలువ జనావాసంలోకి రావడంతో ప్రజలు కంగుతున్నారు. గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డి గోశాలలో ఇండియన్ పైథాన్ జాతికి చెందిన కొండచిలువ దూరింది. అక్కడ ఉన్న 3 కోళ్లను తినేసింది. గమనించిన గోశాల నిర్వాహకులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన డ్యూటీలో ఉన్నా డిప్యూటీ రేంజ్ అధికారి ప్రభాకర్, బేస్ క్యాంప్ వాచ్‌మన్ దాసరి అశోక్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను చాకచక్యంగా సంచిలో బంధించారు. అనంతరం సమీప అడవిలో విడిచి పెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి
Follow Us
వైరల్ వీడియోలు
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
హత్య చేసి ఇంట్లో పాతి పెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ!
డ్రగ్ టెస్ట్‌లో నటి హేమకు ‘నెగెటివ్
వృద్ధురాలికి వానరం.. కన్నీటి వీడ్కోలు
నిప్పుల కొలిమిలా ఏపీ...54 మండలాల్లో తీవ్ర వడగాలుల ముప్పు!
50 రోజులు జైల్లో 25 హోటల్లో.. 19 గంటలు బస్సులో..
పాకిస్థాన్‌లో పెట్రో మంటలు.. లీటరు ఎంతో తెలుసా?

