No Beggars: ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
భారతదేశంలో యాచకులు లేని ప్రాంతం ఉండదు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, బస్టాండులు, రైల్వే స్టేషన్లు ఇలా ప్రతిచోటా యాచకులు కనిపించడం సర్వసాధారణమైపోయింది. అయితే, యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే భిక్షాటనను నిషేధించిన జిల్లా అధికారులు.. యాచకులకు సాయం చేసే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
‘‘ఇండోర్ నగరాన్ని యాచకులులేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా డిసెంబర్ చివరి వరకు వీటిపై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తాం. జనవరి 1 నుంచి యాచకులకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నట్లు కనిపిస్తే వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తాం’’ అని ఇండోర్ కలెక్టర్ ఆశిశ్ సింగ్ హెచ్చరించారు. భిక్షాటన చేస్తున్న వారికి ఎటువంటి సాయం చేయొద్దని, వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు.యాచకులు లేని నగరాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ.. 10 నగరాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ సహా పలు నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో భాగంగా భిక్షాటన కార్యకలాపాలపై దృష్టి సారించిన ఇండోర్ అధికారులు ఆశ్చర్యకరమైన విషయాలు గుర్తించారు. కొందరికి పక్కా ఇళ్లు ఉన్నాయని, మరికొందరి పిల్లలు ఉద్యోగాలు కూడా చేస్తున్నట్లు తెలుసుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా వచ్చిన కొన్ని ముఠాలు అనేక మందిని యాచక వృత్తిలో దించుతున్నట్లు తెలిసిందని ప్రాజెక్టు ఆఫీసర్ దినేశ్ మిశ్రా పేర్కొన్నారు. ఇటువంటి అసాంఘీక చర్యలకు తావులేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామన్నారు. భిక్షాటన చేసే వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని చెప్పారు. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాల జాబితాలో ఇండోర్ కొంతకాలంగా అగ్రస్థానంలో నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను వరుసగా కైవసం చేసుకుంటోంది. పరిశుభ్రతలోనే కాకుండా యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకూ ప్రయత్నాలు చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.