నాకు అలాంటి వాడే భర్తగా రావాలి: రష్మిక

18 December 2024

Basha Shek

ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ జోష్ లో ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఈ సినిమా 1500 కోట్లకు చేరువలో ఉంది.

ఫుల్ హ్యాపీ మూడ్‌ లో ఉన్న రష్మిక గా ప్రేమ, రిలేషన్‌ పై తన మనసులోని భావాలను బయట పెట్టింది.

ఈ సందర్భంగా తనజీవితంలోకి రాబోయే లైఫ్ పార్ట్‌నర్‌  ఎలా ఉండాలో కూడా  చెప్పుకొచ్చింది రష్మిక మందన్నా.

'నా లైఫ్ పార్ట్‌నర్ నా జీవితంలోని ప్రతీ దశలోను తోడుండాలి. అన్నివేళలా నాకు భద్రతనివ్వాలి'

'ముఖ్యంగా లైఫ్ లో నాకు కష్ట సమయం వచ్చినప్పుడు నాకు సపోర్ట్‌ చేయాలి. కచ్చితంగా ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి'

' శ్రద్ధ వహించాలి. మంచి మనసు ఉండాలి. ఒకరిపై ఒకరు బాధ్యతగా ఉండే జీవితాంతం కలిసిఉండొచ్చు' అంది రష్మిక.

 ఇక ప్రేమ గురించి మాట్లాడుతూ.. ' నా దృష్టిలో ప్రేమలో ఉండడం అంటే భాగస్వామిని కలిగిఉండడమే' అని  రష్మిక తెలిపింది  

' జీవితంలో మనకంటూ ఒక తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం ఉండదు. మన కష్టాల్లో మనతో ఉండి సపోర్ట్‌ చేసేవారు ఉండాలి’ అని చెప్పింది రష్మిక.