AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sekhar Kammula:శేఖర్ కమ్ముల కూతురును చూశారా? ఇప్పుడేం చేస్తుందో తెలుసా? లేటెస్ట్ ఫొటోస్ వైరల్

తెలుగులో ఫీల్ గుడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ శేఖర్ కమ్ముల. గతేడాది 'కుబేర' సినిమాతో మరో సూపర్ హిట్ సొంతం చేసుకున్నారీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ఈ సినిమా ఏకంగా రూ. 130 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు శేఖర్ కమ్ముల.

Sekhar Kammula:శేఖర్ కమ్ముల కూతురును చూశారా? ఇప్పుడేం చేస్తుందో తెలుసా? లేటెస్ట్ ఫొటోస్ వైరల్
Sekhar Kammula
Basha Shek
|

Updated on: Feb 06, 2026 | 9:14 PM

Share

శేఖర్ కమ్ముల.. తెలుగు ఆడియెన్స్ కు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించడంలో ఈ డైరెక్టర్ ది ప్రత్యేక శైలి. 2000లో డాలర్ డ్రీమ్స్ సినిమాతో కెరీర్ ప్రారంభించారు శేఖర్ కమ్ముల. ఆ తర్వాత ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా, లవ్ స్టోరీ, కుబేర.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఆడియెన్స్ కు అందించాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ఈయన సినిమాల్లో లవ్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే శేఖర్ కమ్ముల సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. లవ్ స్టోరీ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల గతేడాది కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కోలీవుడ్ స్టార్ ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున మరో కీలక పాత్రలో మెరిశాడు. శేఖర్ కమ్ముల తన రొటీన్ కు భిన్నంగా తీసిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఓవరాల్ గా రూ.130 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇటీవల 54వ బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకున్నారు శేఖర్ కమ్ముల. ఈ సందర్భంగా డైరెక్టర్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ఆయన కూతురు వందన సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన ఫొటోలు షేర్ చేసింది. అంతేకాదు ‘ఈయన నా కెప్టెన్’ అని క్రేజీ క్యాప్షన్ రాసుకొచ్చింది.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల కూతురు షేర్ చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. ఇందులో వందన చాలా క్యూట్ గా కనిపించింది. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఖ‌ర్‌ కమ్ములకు ఇంత పెద్ద కూతురు ఉందా? అందంలో వందన హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు’ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 తండ్రి శేఖర్ కమ్ములతో వందన..

ప్రస్తుతం వందన చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సినిమాలపై కూడా ఆసక్తి ఉందని తెలుస్తోంది. అందుకే  ఈ మధ్యన సినిమా ఈవెంట్లలోనూ మెరుస్తోందీ స్టార్ కిడ్. గతేడాది కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ సందడి చేసిన వందన ఆ తర్వాత తన తండ్రి సినిమాకు రివ్యూ ఇస్తూ బాగా వైరల్ అయిపోయింది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ క్యూటీకి బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.