Ram Gopal Varma: సినిమా పైరసీని ఆపాలంటే.. అదొక్కటే పరిష్కారం.. రామ్ గోపాల్ వర్మ..
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్న పలు విషయాలపై తన స్టైల్లో స్పందిస్తుంటారు. తాజాగా సినిమా పైరసీ సమస్య సుధీర్ఘ పోస్ట్ చేశారు. పైరసీని అరికట్టాలంటే కేవలం దానిని అందించేవారినే కాకుండా.. చూసే ప్రేక్షకులను సైతం శిక్షించాలన ట్వీట్ చేశారు.

కొన్నాళ్లుగా సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ సమస్యపై తాజాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ విషయంపై తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పైరసీని అరికట్టాలంటే కేవలం దానిని అందించేవారినే కాకుండా.. చూసే ప్రేక్షకులను సైతం నేరస్తులుగా చూడాలని ట్వీట్ చేశారు. సినిమా పైరసీ సమస్యపై ట్విట్టర్ ఖాతాలో సుధీర్ఘ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
“పైరసీ ఎప్పటికీ ఆగదు.. ఎందుకంటే టెక్నాలజీ మరీ అడ్వాన్స్‌డ్‌గా ఉందని కాదు లేదంటే పోలీసుల నిఘా మరీ బలహీనంగా ఉందని కాదు. దానికి ఒక్కటే కారణం పైరసీ సినిమాలను చూసే జనం ఉన్నంత వరకు.. వాళ్లకు ఆ కంటెంట్‌ను అందించే రవి లాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇక్కడ జోక్ ఏమిటంటే.. ఈ రవి అభిమానులు అతన్ని గర్వంగా రాబిన్ హుడ్‌తో పోలుస్తున్నారు. ఇదేదో నోబెల్ బహుమతి గెలిచేంతటి గొప్ప లాజిక్‌గా వాళ్ళు భావిస్తున్నారు. ముందుగా రాబిన్ హుడ్ అనేవాడు హీరో కాదు.. కరెక్ట్ లెక్క ప్రకారం చూస్తే అతడు ప్రపంచంలోనే మొట్టమొదటిగా నమోదు చేయబడిన ఉగ్రవాది. ధనవంతుల నుంచి దోచుకుని పేదలకు ఇస్తాడు.. అంటే ధనవంతులు చేసిన ఏకైక నేరం వాళ్ళు ధనవంతులు కావడమే. ఆర్థికంగా విజయం సాధించడం అనేది దొంగతనం, హత్యలకు దారితీసే నేరం అని భావించే వ్యక్తిత్వం ఎంత దిగజారిందో ఊహించండి. దొంగిలించబడిన వస్తువులను ఉచితంగా పొందుతున్నారు అనే ఒక్క కారణంతో ఒక నేరస్తుడిని మంచి మార్గంలో వెళ్తున్న వ్యక్తిగా కీర్తించడం అనేది తెలివి తక్కువ తనమే అవుతుంది.
వాళ్ళ లాజిక్ ఇలా ఉంటుంది:
* సినిమా టికెట్ ఎక్కవైందా.. అయితే పైరసీ సమర్థనీయమే.. * పాప్‌కార్న్ ధర ఎక్కువైందా.. అయితే సినిమాను లీక్ చేయండి.. * టికెట్ రేట్లు అధికమా..? అయితే కంటెంట్‌ను దొంగిలించండి
ఈ లాజిక్ ప్రకారం చూస్తే.. ఒక BMW కారు ఖరీదైనదైతే, మీరు షోరూమ్‌ను దోచుకుని, ఆ కార్లన్నింటినీ స్లమ్‌లోని ప్రజలందరికీ పంచాలి. నగలు ఖరీదైనవా..? అయితే షాపును దోచుకుని ఉచితంగా పంచండి. ఈ లాజిక్ అన్ని వస్తువులకూ వర్తిస్తుంది.
ఇలాంటి ఆలోచన సమాజంలో అరాచకానికి దారితీసి సామాజిక అసమానత, విద్రోహానికి దారితీస్తుంది. ప్రజలు పైరేటెడ్ కంటెంట్‌ను చూడటానికి కారణం ఏదో గొప్ప నైతిక విప్లవం కాదు.. వాళ్ల సౌలభ్యం కోసమే. కొందరికి డబ్బు ఆదా అవుతుంది.. చాలా మందికి థియేటర్‌కు వెళ్లే సమయం ఆదా అవుతుంది. కేవలం ఒక లింక్‌ను క్లిక్ చేస్తే చాలు. నాలాంటి వాళ్ళు కూడా అదే కారణంతో పైరేటెడ్ కంటెంట్‌ను చూస్తారు.
పైరసీని ఆపాలని ఎవరైనా నిజంగా సీరియస్‌గా అనుకుంటే, దానికి ఒక్కటే నిజమైన పరిష్కారం ఉంది: కంటెంట్‌ను సరఫరా చేసేవారిని నేరస్తులుగా పరిగణించడంతో పాటు.. చూసేవారిని కూడా నేరస్తులుగా పరిగణించాలి. పైరేట్‌ను పట్టుకోవడం కష్టం, ఎందుకంటే అతను సీక్రేట్ డిజిటల్ ప్రాంతాలలో దాక్కుంటాడు. కానీ చూసే ప్రేక్షకుడిని పట్టుకోవడం సులభం. పైరేటెడ్ కంటెంట్‌ను చూస్తున్న యాదృచ్ఛికంగా 100 మందిని అరెస్ట్ చేసి, వారి పేర్లను బహిరంగంగా ప్రకటించండి. అప్పుడు అందరూ ఒక విషయం గ్రహిస్తారు.. ఒక సినిమా లింక్‌ను చూడటం లేదా ఫార్వార్డ్ చేయడం అంటే దొంగిలించిన వస్తువులను స్మగ్లింగ్ చేయడం లేదా వాటిని స్వీకరించడం లాంటిదే.
భయం పనిచేస్తుంది.. నైతికత పనిచేయదు..” అంటూ ట్వీట్ చేశారు.
ROBIN HOOD RAVI
Piracy will never stop. Not because technology is too advanced or policing too weak , but because as long as there are a large number of people to watch a pirated film there will always be Ravis to serve them.
Now the funniest thing is Ravi supporters proudly…
— Ram Gopal Varma (@RGVzoomin) November 22, 2025
ఇవి కూడా చదవండి : Actress : 19 ఏళ్ల వయసులో 32 ఏళ్ల హీరోతో ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
