Puri Jagannadh: భారీ బడ్జెట్ సినిమా ప్లాప్.. ఆయన ఫోన్ కాల్‌తో ఎమోషనల్ అయిపోయా.. పూరీ జగన్నాథ్..
ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ సినిమాను రూపొందిస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే హనుమకొండలోని జెఎన్ఎస్ స్టేడియంలో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను తెరకెక్కించిన ఓ సినిమా ప్లాప్ కావడంతో రచయిత విజయేంద్ర ప్రసాద్ ఫోన్ చేసి మాట్లాడటంతో ఎమోషనల్ అయ్యాయని చెప్పుకొచ్చారు.
పూరీ జగన్నాథ్.. తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతాలు సృష్టించిన డైరెక్టర్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాశాడు. పూరీ సినిమాల్లో హీరోయిజం.. స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ యూత్ కు తెగ నచ్చేస్తాయి. కానీ కొన్నాళ్లుగా పూరీ జగన్నాథ్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. చాలా రోజులుగా వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన పూరీ.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత మాత్రం విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన లైగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం చవిచూసింది. దీంతో పూరీ జగన్నాథ్ తన నెక్ట్స్ సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ సినిమాను రూపొందిస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే హనుమకొండలోని జెఎన్ఎస్ స్టేడియంలో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను తెరకెక్కించిన ఓ సినిమా ప్లాప్ కావడంతో రచయిత విజయేంద్ర ప్రసాద్ ఫోన్ చేసి మాట్లాడటంతో ఎమోషనల్ అయ్యాయని చెప్పుకొచ్చారు.
పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. “సినిమా హిట్టయితే చాలా మంది ఫోన్ చేసి ప్రశంసిస్తారు. ప్లాప్ అయినా నాకు ఓ కాల్ వచ్చింది. అది కూడా విజయేంద్ర ప్రసాద్. నాకో సాయం చేస్తారా ? అని అడిగారు. ఆయన కుమారుడు రాజమౌళి డైరెక్టర్.నేనేం హెల్ప్ చేయాలని మనసులో అనుకున్నాను. మీ నెక్ట్స్ మూవీ ఎప్పుడూ చేస్తున్నారు.. ?మీరెప్పుడు చేసినా ఆ సినిమా కథ నాకు చెబుతారా..? అని అడిగారు. ఆయనెందుకు అలా అంటున్నారో కాస్త అర్థమయ్యింది. మీలాంటి డైరెక్టర్స్ ఫెయిల్ కావడం నేను చూడలేను. చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అందుకే తీసే ముందు నాకు ఒక్కసారి చెప్పండి అని అన్నారు. ఆయన మాటలకు ఎమోషనల్ అయ్యాను. నాపై అభిమానంతో చేసిన ఆ కాల్ ఎప్పటికీ మర్చిపోలేను. అయితే ఈ స్టోరీ గురించి మాత్రం ఆయనకు చెప్పలేదు. జాగ్రత్తగా రూపొందించి.. నేరుగా సినిమాను చూపించాలనుకున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
తెలుగు దర్శకుల్లో అత్యంత ప్రతిభ ఉన్న దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకరు. విజయేంద్రప్రసాద్‌కి పూరీ జగన్నాథ్ అంటే చాలా ఇష్టం. పూరీ జగన్నాథ్ ప్రతిభకు, సినిమా పై ప్యాషన్, స్టైల్ కు వీరాభిమాని. అందుకే పూరీ జగన్నాథ్‌లా ఉండాలనే కోరికతో ఆయన చిత్రాన్ని మొబైల్ వాల్‌పేపర్‌గా పెట్టుకున్నారు విజయేంద్ర ప్రసాద్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.