Venu Swamy: వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు.. ఈనెల 22 వరకే ఛాన్స్..

తాజాగా వేణు స్వామిపై తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. చైతన్య, శోభితా విడిపోతారంటూ ఓ వీడియో రిలీజ్ చేయడం.. సీనితారల వ్యక్తిగత విషయాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడంటూ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తోపాటు అనుబంధ సంస్థ తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారదను కలిసి వేణు స్వామిపై ఫిర్యాదు చేశారు. తాజాగా తెలంగాణ మహిళా కమిషన్ వేణుస్వామికి షాకిచ్చింది.

Venu Swamy: వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు.. ఈనెల 22 వరకే ఛాన్స్..
Venu Swamy
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 13, 2024 | 6:48 PM

వేణుస్వామి.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి జాతకాలు చెబుతూ కొన్నాళ్లుగా చాలా ఫేమస్ అయ్యాడు. సమంత, నాగచైతన్య విడిపోతారని చెప్పడం.. ఆ తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకోవడం జరిగింది. సోషల్ మీడియాలో వేణుస్వామి ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. దీంతో పలువురు హీరోయిన్స్ వేణుస్వామి వద్ద ప్రత్యేక పూజలు కూడా చేయించారు. ఇటీవల జరిగిన నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ గురించి సంచలన కామెంట్స్ చేశాడు. చైతూ, శోభితా 2027లో విడిపోతారంటూ జోస్యం చెప్పాడు. దీంతో తాజాగా వేణు స్వామిపై తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. చైతన్య, శోభితా విడిపోతారంటూ ఓ వీడియో రిలీజ్ చేయడం.. సీనితారల వ్యక్తిగత విషయాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడంటూ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తోపాటు అనుబంధ సంస్థ తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారదను కలిసి వేణు స్వామిపై ఫిర్యాదు చేశారు. తాజాగా తెలంగాణ మహిళా కమిషన్ వేణుస్వామికి షాకిచ్చింది.

మహిళా చైర్ పర్సన్ నేరేళ్ల శారద ఈనెల 22న వేణుస్వామి వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసినట్లుగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు సెలబ్రెటీల వ్యక్తిగత విషయాల గురించి బహిరంగంగా కామెంట్స్ చేస్తూ వీడియోస్ చేసిన వేణు స్వామికి ఇలా నోటీసులు రావడం షాక్ అనే చెప్పుకోవాలి. ఈ నోటీసులపై వేణు స్వామి ఎలా స్పందిస్తాడో చూడాలి.

తారల పర్సనల్ విషయాల గురించి వేణు స్వామి జోస్యం చెప్పడం ఇది మొదటి సారి కాదు. గతంలోనూ పలు సినిమాల విడుదల, రాజకీయ ఫలితాలు, టాలీవుడ్ స్టార్ హీరోస్ కెరీర్, పెళ్లి గురించి అనేక కామెంట్స్ చేశాడు. కొద్ది రోజులవరకు సైలెంట్ అయిన వేణు స్వామి ఇటీవల చైతన్య, శోభితా నిశ్చితార్థం గురించి కామెంట్స్ చేయడంతో తెలంగాణ మహిళా కమిషన్ ఆయనకు షాకిచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.