Prashanth Varma: మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్..

ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టంది. ఇక ఈ సినిమా పలు థియేటర్లలో విజయవంతంగా 100 రోజులు ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్ లో విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రతి ఏడాది హనుమాన్ జయంతికి తనో సినిమా అప్డేట్ ఇవ్వాల్సి వస్తుందని.. అది పెద్ద బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. నిజానికి హనుమాన్ సినిమాతో సూపర్ హీర్ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేశాడు

Prashanth Varma: మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్..
Prashanth Varma
Follow us

|

Updated on: Apr 23, 2024 | 9:48 PM

ఒకే ఒక్క సినిమాతో యావత్ దేశవ్యాప్తంగా ప్రజలంద నుంచి ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా హనుమాన్ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టంది. ఇక ఈ సినిమా పలు థియేటర్లలో విజయవంతంగా 100 రోజులు ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్ లో విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రతి ఏడాది హనుమాన్ జయంతికి తనో సినిమా అప్డేట్ ఇవ్వాల్సి వస్తుందని.. అది పెద్ద బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. నిజానికి హనుమాన్ సినిమాతో సూపర్ హీర్ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఈ యూనివర్స్ లో రానున్న 20 ఏళ్లలో పలు సూపర్ హీరో సినిమాలు రాబోతున్నాయని తెలిపారు.

ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. “ఇది ఎన్నో ఏళ్ల కల. 20 సంవత్సరాల పాటు నేనుూ ఈ యూనివర్స్ తో ప్రయాణించబోతున్నాను. హనుమాన్ సినిమాలో మీరు చూసిన క్యారెక్టర్స్ రాబోయే చిత్రాల్లోనూ కనిపిస్తాయి. విభీషణుడిగా సముద్రఖని.. హనుమంతుగా తేజ కొనసాగుతాడు. అలాగే ఈ యూనివర్స్ లో చాలా మంది కొత్తవారిని పరిచయం చేయనున్నాం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి టాప్ నటులను ఎంపిక చేస్తాం. నా సినిమా నచ్చి వారే యూనివర్స్ లో భాగమవ్వాలని ఉందని అడిగారు. అలాగే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా చేస్తున్నాం. పీవీసీయూపై మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. పాత్ర ఎమోషన్, కంటెంట్, వీఎఫ్ఎక్స్ అన్నింటినిలో జై హనుమాన్ మరో స్థాయిలో ఉంటుంది” అని అన్నారు.

ప్రశాంత్ వర్మ కామెంట్స్ ఇప్పుడు జై హనుమాన్ సినిమాపై ప్రేక్షకులలో మరిన్ని అంచనాలు పెంచేశాయి. ఈ మూవీ సీక్వెల్ లో హనుమాన్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారని మొన్నటివరకు నెట్టింట ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రశాంత్ వర్మ కామెంట్స్ విన్న తర్వాత ఇందులో చిరంజీవి ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరీ ప్రశాంత్ వర్మ ఏం ప్లాన్ చేశాడో.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?