AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి.. ఇప్పుడు అటామ్ బాంబ్..

అతి తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న ఈబ్యూటీ ఒకప్పుడు బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంది. అంతేకాకుండా కెరీర్ తొలినాళ్లలో ట్రోలింగ్ భారీన పడింది. ఇన్నాళ్లు తమిల్ సినీ పరిశ్రమలో అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు తెరకు పరిచయమయ్యేందుకు రెడీ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టగలరా ?

Tollywood: ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి.. ఇప్పుడు అటామ్ బాంబ్..
Actress 2
Rajitha Chanti
|

Updated on: Apr 23, 2024 | 9:29 PM

Share

పైన ఫోటోలో చీరకట్టులో ఎంతో పద్దతిగా కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల కలల రాకూమారి. అతి తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న ఈబ్యూటీ ఒకప్పుడు బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంది. అంతేకాకుండా కెరీర్ తొలినాళ్లలో ట్రోలింగ్ భారీన పడింది. ఇన్నాళ్లు తమిల్ సినీ పరిశ్రమలో అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు తెరకు పరిచయమయ్యేందుకు రెడీ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టగలరా ?.. తనే సౌత్ క్రష్ దివ్య భారతి. కోయంబత్తూరుకు చెందిన ఈ ముద్దుగుమ్మ మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత తమిళ్ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. సినిమాలకంటే ముందు సీరియల్స్ లో నటించింది. కొత్త దర్శకుడు సతీష్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం బ్యాచిలర్‌ మూవీతో నటిగా పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన ఈబ్యూటీ తనదైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించారు.

దివ్య భారతి తమిళనాడులోని కోయంబత్తూరు పట్టణంలో 1992 జనవరి 28న జన్మించింది. దివ్య భారతి తన పాఠశాల విద్యను పూర్తి చేసి, ఈరోడ్‌లోని బన్నారి అమ్మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ITలో B.Tech కంప్లీట్ చేసింది. 015లో ‘మిస్ ఎత్నిక్ ఫేస్ ఆఫ్ మద్రాస్’ విజేతగా నిలిచింది. అదే సంవత్సరంలో, దివ్య భారతి ‘పాపులర్ న్యూ ఫేస్ మోడల్’గా కూడా కిరీటాన్ని పొందింది. ‘ప్రిన్సెస్ ఆఫ్ కోయంబత్తూర్ 2016’ టైటిల్‌ను గెలిచింది.

ప్రస్తుతం దివ్య భారతి సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గోట్.. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. విశ్వక్ సేన్ యొక్క పాగల్ చిత్రానికి దర్శకత్వం వహించిన నరేష్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లక్కీ మీడియా, మహాతేజ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?