Hanuman Movie: ‘హనుమాన్‌ తీసింది నా కొడుకే’.. ప్రశాంత్‌ వర్మ తండ్రి ఎమోషనల్‌.. వీడియో చూశారా?

కేవలం తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా హనుమాన్‌ సినిమాపై ప్రశంసలు కురుస్తున్నాయి. లో బడ్జెట్‌తో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌ తో మూవీని తీశారంటూ సినీ ప్రముఖులు సైతం హనుమాన్‌ యూనిట్‌ను కొనియాడుతున్నారు. తాజాగా ప్రశాంత్‌ వర్మ తండ్రి హనుమాన్‌ సినిమాను థియేటర్‌ లో వీక్షించాడు.

Hanuman Movie: 'హనుమాన్‌ తీసింది నా కొడుకే'.. ప్రశాంత్‌ వర్మ తండ్రి ఎమోషనల్‌.. వీడియో చూశారా?
Director Prashanth Varma father
Follow us
Basha Shek

|

Updated on: Jan 14, 2024 | 2:55 PM

జాంబి రెడ్డి వంటి సూపర్‌ హిట్‌ తర్వాత డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ, హీరో తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం హనుమాన్‌. అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటించగా, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ మరో కీలక పాత్ర పోషించింది. భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్‌ బ్లాక్‌ బస్టర్‌ టాక్‌తో దూసుకెళుతోంది. బరిలో మహేశ్‌ గుంటూరు కారం, వెంకటేశ్‌ సైంధవ, నాగార్జున నా సామిరంగా వంటి సినిమాలు ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది. కేవలం తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా హనుమాన్‌ సినిమాపై ప్రశంసలు కురుస్తున్నాయి. లో బడ్జెట్‌తో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌ తో మూవీని తీశారంటూ సినీ ప్రముఖులు సైతం హనుమాన్‌ యూనిట్‌ను కొనియాడుతున్నారు. తాజాగా ప్రశాంత్‌ వర్మ తండ్రి హనుమాన్‌ సినిమాను థియేటర్‌ లో వీక్షించాడు. అనంతరం తన కుమారుడి సినిమాపై తన అభిప్రాయాలను అందరితో పంచుకున్నారు.

‘హనుమాన్‌ సినిమాను తెరకెక్కించింది మా అబ్బాయే. నా జీవితంలో మొదటి సారి ఇలాంటి గొప్ప అనుభూతిని పొందుతున్నాను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. నా కుమారుడు ఇంత మంచి సినిమా తీసినందుకు చాలా గర్వంగా ఉంది. ఇందులోని నటీనటులు అంతా వారి పాత్రల్లో ఒదిగిపోయారు. హనుమాన్‌ పార్ట్‌ 2 కాదు త్వరలోనే హనుమాన్‌పై డైరెక్ట్‌గా సినిమా తీస్తాడు’ అని ఎమోషనల్‌ అయ్యారు ప్రశాంత్‌ తండ్రి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హనుమాన్‌ సినిమా విజయాన్ని పంచుకునేందుకు, నన్ను అభినందించేందుకు చాలా మంది ఫోన్‌ చేస్తున్నట్లు ప్రశాంత్‌ వర్మ తెలిపారు. అయితే ప్రస్తుతం తాను తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నానంటూ, త్వరలోనే అందరినీ కలుస్తానంటూ ట్వీట్‌ చేశారు డైరెక్టర్‌. హనుమాన్ లో వినయ్‌ రాయ్‌ స్టైలిష్‌ విలన్‌గా మెప్పించాడు. రాజ్‌ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌, సముద్ర ఖని, గెటప్‌ శీను, సత్య, రోహిణీ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు.

ఇవి కూడా చదవండి

ప్రశాంత్ వర్మ తండ్రి కామెంట్స్. .వీడియో..

రెండు రోజుల్లో 10 లక్షల టికెట్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు టాలీవుడ్ హీరో..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు టాలీవుడ్ హీరో..
అమెరికాలో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం.. కలకలం రేపుతోన్న వైరస్
అమెరికాలో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం.. కలకలం రేపుతోన్న వైరస్
సచిన్ వీడియోతో వైరల్: 12 ఏళ్ల సుశీల మీనా సంచలనం
సచిన్ వీడియోతో వైరల్: 12 ఏళ్ల సుశీల మీనా సంచలనం
ఆ ప్రశ్నతో రామ్ చరణ్‏ను ఇరికించిన బాలయ్య..
ఆ ప్రశ్నతో రామ్ చరణ్‏ను ఇరికించిన బాలయ్య..
మార్చి నెలాఖరు నాటికి TGPSC గ్రూప్‌ 1 నియామకాలు పూర్తి: CM రేవంత్
మార్చి నెలాఖరు నాటికి TGPSC గ్రూప్‌ 1 నియామకాలు పూర్తి: CM రేవంత్
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇదే జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఔట్
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇదే జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఔట్
ఇంటి నుంచి దోమల్ని తరిమికొట్టాలంటే.. అరటి పండుతో ఇలా చేస్తే చాలు!
ఇంటి నుంచి దోమల్ని తరిమికొట్టాలంటే.. అరటి పండుతో ఇలా చేస్తే చాలు!
డిగ్రీ అర్హతతో కెనరా బ్యాంకులో ఉద్యోగాలు.. ఎన్ని పోస్టులున్నాయంటే
డిగ్రీ అర్హతతో కెనరా బ్యాంకులో ఉద్యోగాలు.. ఎన్ని పోస్టులున్నాయంటే
అనామికకు చెక్ పెట్టిన కావ్య.. తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటోంది..
అనామికకు చెక్ పెట్టిన కావ్య.. తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటోంది..
శుభ్‌మన్ గిల్‌పై పక్షపాతం? బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
శుభ్‌మన్ గిల్‌పై పక్షపాతం? బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు