Devil OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన కల్యాణ్‌ రామ్‌ ‘డెవిల్‌’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

రీ అంచనాలతో డిసెంబర్‌ 29న థియేటర్లలోకి అడుగుపెట్టిన డెవిల్‌ యావరేజిగా నిలిచింది. 1940వ దశకంలో సాగే ఈ ఇన్వెస్టిగేషన్ స్పై థ్రిల్లర్ లో కల్యాణ్ రామ్ బ్రిటీష్ ఏజెంట్ గా కనిపించారు. కథా, కథనాలు ఆసక్తిగా ఉన్నా, ట్విస్టులు, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ పుష్కలంగా ఉన్నా ఎందుకో గానీ జనాలకు పెద్దగా ఈ థ్రిల్లర్‌ ఎక్కలేదు.

Devil OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన కల్యాణ్‌ రామ్‌ 'డెవిల్‌'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Devil Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 14, 2024 | 2:03 PM

బింబిసారతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టాడు నందమూరి కల్యాణ్‌ రామ్‌. అయితే అమిగోస్‌ సినిమాతో మళ్లీ నిరాశపర్చాడు. దీంతో ఎలాగైనా హిట్‌ కొట్టాలంటూ డెవిల్‌ సినిమాతో ముందుకొచ్చాడీ నందమూరి హీరో. మలయాళం బ్యూటీ సంయుక్తా మేనన్‌ హీరోయిన్‌ గా నటించింది. అభిషేక్‌ నామా దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో డిసెంబర్‌ 29న థియేటర్లలోకి అడుగుపెట్టిన డెవిల్‌ యావరేజిగా నిలిచింది. 1940వ దశకంలో సాగే ఈ ఇన్వెస్టిగేషన్ స్పై థ్రిల్లర్ లో కల్యాణ్ రామ్ బ్రిటీష్ ఏజెంట్ గా కనిపించారు. కథా, కథనాలు ఆసక్తిగా ఉన్నా, ట్విస్టులు, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ పుష్కలంగా ఉన్నా ఎందుకో గానీ జనాలకు పెద్దగా ఈ థ్రిల్లర్‌ ఎక్కలేదు. దీంతో డెవిల్‌ ఓ మోస్తరు కలెక్షన్లు మాత్రమే సాధించింది. అయితే థియేటర్లలో ఓ మోస్తరుగా అలరించిన కల్యాణ్‌ రామ్‌ సినిమా అప్పుడే డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో డెవిల్‌ డిజిటల్ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శనివారం (జనవరి 13) అర్ధరాత్రి నుంచే డెవిల్‌ సినిమా ఓటీటీలో ప్రత్యక్షమైంది. అంటే థియేట్రికల్‌ రిలీజ్‌ జరిగిన రెండు వారాలకే డెవిల్‌ ఓటీటీకి వచ్చేసిందన్నమాట. బహుశా సంక్రాంతి సీజన్‌ కాబట్టి సెలవుల్లో తమ సినిమాను ఎంజాయ్‌ చేయవచ్చన్న అభిప్రాయంతో డెవిల్‌ను త్వరగానే స్ట్రీమింగ్‌ కు తీసుకువచ్చారేమో.

ఇవి కూడా చదవండి

‘డెవిల్’ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై దేవాంన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మించారు. ప్రారంభంలో వేరే దర్శకుడి పేరు తెరమీదకు రాగా మధ్యలో మళ్లీ అభిషేక్‌ నామా దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. మాళవిక నాయర్, అజయ్, సత్య, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఎస్తర్‌, ఎల్నాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరాలు సమకూర్చారు. మరి సంక్రాంతి హాలీడేస్ లో మంచి థ్రిల్లర్‌ మూవీ కావాలంటే డెవిల్‌ పై ఒక లుక్‌ వేయవచ్చు.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

థియేట్రికల్ రిలీజ్ జరిగిన రెండు వారాలకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.