Chandramukhi 3: చంద్రముఖి 3 గురించి ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు పి వాసు

హారర్‌ థ్రిల్లర్ జానర్‌లో క్లాసిక్‌గా నిలిచిపోయింది. చంద్రముఖి రిలీజ్ అయిన దగ్గర నుంచే ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించాలన్న డిమాండ్స్‌ వినిపించాయి. రజనీకాంత్ ఇంట్రస్ట్ చూపించకపోవటంతో సీక్వెల్ డీలే అవుతూ వచ్చింది.

Chandramukhi 3: చంద్రముఖి 3 గురించి ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు పి వాసు
Chandramukhi 3
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 19, 2023 | 9:50 AM

సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఫిలిం కెరీర్‌ ఇక ముగిసినట్టే అనుకుంటున్న టైమ్‌లో సూపర్ హిట్‌తో రజనీ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసిన సినిమా చంద్రముఖి. పీ వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. హారర్‌ థ్రిల్లర్ జానర్‌లో క్లాసిక్‌గా నిలిచిపోయింది. చంద్రముఖి రిలీజ్ అయిన దగ్గర నుంచే ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించాలన్న డిమాండ్స్‌ వినిపించాయి. రజనీకాంత్ ఇంట్రస్ట్ చూపించకపోవటంతో సీక్వెల్ డీలే అవుతూ వచ్చింది.

వెంకటేష్ హీరోగా నాగవల్లి పేరుతో చంద్రముఖి తరహా కథతోనే ఓ సినిమా తెరకెక్కించినా.. అది అఫీషియల్‌ సీక్వెల్‌ మాత్రం కాదు. రీసెంట్‌గా చంద్రముఖి సినిమాకు అఫీషియల్ రీమేక్‌ను స్టార్ట్ చేశారు మేకర్స్‌. లారెన్స్ లీడ్ రోల్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌ చంద్రముఖిగా కనిపించనున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా అప్‌డేట్‌ ఇచ్చిన దర్శకుడు మరో ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు.

చంద్రముఖి తొలి భాగంలో ఓ భారీ పామును చూపించారు. సినిమాలో ఆ పాముకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండకపోవటంతో… ఎడిటింగ్‌లో ఆ సీన్స్ కట్ అయ్యాయేమో అనుకున్నారు ఆడియన్స్‌. కానీ ఈ విషయంలో రీసెంట్‌ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు కెప్టెన్ వాసు. చంద్రముఖి కథలో ఆ రాజసర్పానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని.. ఆ క్లారిటీ చంద్రముఖి 3లో ఉంటుందని చెప్పారు. దీంతో త్వరలొనే ఈ సూపర్‌ హిట్ సిరీస్‌లో మరో మూవీ రానుందన్న విషయంలో క్లారిటీ వచ్చింది.