AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anni Manchi Sakunamule: ఆ స్టార్ హీరో కోసం రాసుకుంటే సంతోష్ శోభన్ చేశాడు.. డైరెక్టర్ నందిని ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా.. బుధవారం విలేకరులతో ముచ్చటించిన నందినీ రెడ్డి ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. తొలిసారి తన సినీ జీవితంలో ఓ కథ ఏం కోరుకుంటుందో దానికి తగ్గట్టుగానే ప్రయాణం చేసి తీసిన సినిమా ఇదని.. ఎలాంటి లెక్కలు వేసుకోకుండా కథకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు.

Anni Manchi Sakunamule: ఆ స్టార్ హీరో కోసం రాసుకుంటే సంతోష్ శోభన్ చేశాడు.. డైరెక్టర్ నందిని ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Anni Manchi Sakunamule
Rajitha Chanti
|

Updated on: May 18, 2023 | 11:05 AM

Share

కళ్యాణ వైభోగమే, ఓ బేబీ చిత్రాలను తెరకెక్కించి హిట్స్ అందుకున్నారు డైరెక్టర్ నందినీ రెడ్డి. ఈ రెండింటి తర్వాత ఈ లేడీ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమా అన్నీ మంచి శకునములే. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ సినిమాను ప్రియాంక దత్, స్వప్నదత్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకోగా.. ఈ మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా.. బుధవారం విలేకరులతో ముచ్చటించిన నందినీ రెడ్డి ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. తొలిసారి తన సినీ జీవితంలో ఓ కథ ఏం కోరుకుంటుందో దానికి తగ్గట్టుగానే ప్రయాణం చేసి తీసిన సినిమా ఇదని.. ఎలాంటి లెక్కలు వేసుకోకుండా కథకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు.

“సాధారణంగా నేను కథను రాసుకున్న తర్వాత ఏ పాత్రకు ఎవరు బాగుంటారా అనేది చూస్తాను.. కానీ అన్నీ మంచి శకునములే కథను మాత్రం చాలా కాలం క్రితమే విజయ్ దేవరకొండను అనుకుని రాసుకున్నాను. అయితే అప్పటికే విజయ్ దేవరకొండ క్రేజ్ నెక్ట్స్ లెవల్ కు వెళ్లిపోయింది. ప్రేక్షకులు ఆయనను చూడాలనుకుంటున్న విధానం మారిపోయింది. ఈ కథను ఇప్పటికే కొద్దిమంది హీరోలకు చెప్పిన మాట నిజమే. వాళ్లు వాళ్ల ఇమేజ్ కు తగ్గట్టుగా లేదనుకుని ఉండొచ్చేమో… కానీ ఎవరూ ఈ కథకు ఫైట్లు జోడించమని చెప్పలేదు. ఎవరైనా సరే.. ఒక కథకు గౌరవం అంటూ ఇవ్వాల్సిందే. హీరో కోసమని ఇలాంటి కథల్ని మారిస్తే న్యాయం జరగదు. కథకు తగిన తారలు ఉండాలి. నేను రాసుకున్న కథ అలాంటి హీరోను కోరుకుంటే.. అగ్ర హీరోలతోనూ నటిస్తాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

‘స్వప్న సినిమాస్ బ్యానర్లో ఈ సినిమాను చేద్దామని అనుకున్న తర్వాత తనే నాకు సంతోష్ శోభన్ పేరు సూచించింది. స్క్రీన్ టెస్ట్ చేస్తే అతను ఆ పాత్రకు సరిగ్గా సెట్ అయ్యాడు. అందుకే తనను తీసుకోవడం జరిగింది. ఈ సినిమపై నాకంటే స్వప్నకి ఎక్కువ నమ్మకం ఉంది.. ఆ నమ్మకాన్ని చూసి నాకు భయం వేస్తూ ఉంటుంది’ అని అన్నారు నందినీ.

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!