Ponniyin Selvan: వివాదంలో పొన్నియన్ సెల్వన్ సినిమా.. హీరో విక్రమ్, మణిరత్నంకు కోర్టు నోటీసులు..

తాజాగా పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమాకు సంబంధించి డైరక్టర్‌ మణిరత్నం, హీరో విక్రమ్‌కి కోర్టు నోటీసులు అందాయి. ఈ చిత్రంలో ఆదిత్య కరికాలన్‌గా నటించారు విక్రమ్‌. చరిత్రను వక్రీకరించే విధంగా సన్నివేశాలు ఉండకూడదని,

Ponniyin Selvan: వివాదంలో పొన్నియన్ సెల్వన్ సినిమా.. హీరో విక్రమ్, మణిరత్నంకు కోర్టు నోటీసులు..
Ponniyin Selvan
Follow us

|

Updated on: Jul 18, 2022 | 3:37 PM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan). భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ సినిమాలో తమిళ్ స్టార్ విక్రమ్, కార్తి, త్రిష, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే వీరి క్యారెక్టర్స్ తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పొన్నియన్ సెల్వన్ మూవీ ఇప్పుడు చివరి దశలో ఉంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్ లోని పలు సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ డైరెక్టర్ మణిరత్నంతోపాటు హీరో విక్రమ్ కు కోర్టు నోటీసులు పంపించింది.

ఇక తాజాగా పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమాకు సంబంధించి డైరక్టర్‌ మణిరత్నం, హీరో విక్రమ్‌కి కోర్టు నోటీసులు అందాయి. ఈ చిత్రంలో ఆదిత్య కరికాలన్‌గా నటించారు విక్రమ్‌. చరిత్రను వక్రీకరించే విధంగా సన్నివేశాలు ఉండకూడదని, సినిమా విడుదలకు ముందు కోర్టులో ప్రదర్శించాలని సెల్వమ్‌ అనే లాయర్‌ కోర్టులో కేసు వేశారు. టీజర్ లో అదిత్య కరికాలన్ గా నటించిన విక్రమ్ నుదటిపై తిలకం లేదని ఎత్తి చూపారు. కానీ ఆయనకు సంబంధించిన పోస్టర్ లో మాత్రం తిలకం ఉందని చూపించారు. చోళులలను తప్పుగా చూపించారని ఆయన ఆరోపించారు. దర్శకనిర్మాతలు వాస్తవాలు చూపించడంలో విఫలమయ్యారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు ముందు కోర్టులో ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. ఇక తమకు వచ్చిన నోటీసులపై హీరో విక్రమ్, డైరెక్టర్ మణిరత్నం ఇప్పటివరకు స్పందించలేదు. 1955లో రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ మణిరత్నం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో సెప్టెంబర్ 30న ఈ సినిమా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.