AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dilraju: షూటింగ్స్ బంద్ పై స్పందించిన దిల్‏రాజు.. ఏం చెప్పారంటే ?..

సినిమా నిర్మాణ ఖర్చు తగ్గించుకునే విషయంలో నిర్మాతల మధ్య చర్చ జరుగుతోంది. ఈ చర్చలు ప్రారంభదశలోనే ఉన్నాయని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలిపారు.

Dilraju: షూటింగ్స్ బంద్ పై స్పందించిన దిల్‏రాజు.. ఏం చెప్పారంటే ?..
Dil Raju
Rajitha Chanti
|

Updated on: Jul 18, 2022 | 3:53 PM

Share

తెలుగు చిత్రపరిశ్రమలో త్వరలోనే షూటింగ్స్ ఆగిపోతాయని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు మూడు రోజుల నుంచి ఈ ప్రచారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే నిర్మాతలు బంద్ ప్రకటించే అవకాశం ఉందని.. ఇప్పటికే వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయని.. సోమవారం నాడు బంద్ ప్రకటించే అవకాశముందన్నారు. ఇక ఇదే విషయంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. నిర్మాణ వ్యయం తగ్గించుకునే విషయంలో తమ మధ్య చర్చ జరుగుతుందని.. షూటింగ్స్ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇండస్ట్రీని కాపాడుకోవడానికి నిర్మాతలు అంతా ఒకతాటిపైకీ రావాలన్నారు.

సినిమా నిర్మాణ ఖర్చు తగ్గించుకునే విషయంలో నిర్మాతల మధ్య చర్చ జరుగుతోంది. ఈ చర్చలు ప్రారంభదశలోనే ఉన్నాయని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలిపారు. షూటింగ్స్‌ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. మంచి కంటెంట్‌తో సినిమాలు తీయడంపై నిర్మాతల మధ్య చర్చ జరిగిందని దిల్‌రాజు వెల్లడించారు. సినిమా టికెట్‌ ధరలు ప్రేక్షుకుడికి అందుబాటులో ఉండటం, ఓటీటీలో సినిమాల విడుదల అనేది 8 నుంచి 10 వారాల తర్వాత ఉంటే బాగుంటుందనే అంశంపైకూడా చర్చించామని ఆయన తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో చాలా మంది కథలు రాయడం, హీరోలు ఒప్పుకోవడం, నిర్మాతలు సినిమా తీయడం జరిగిందని దిల్‌రాజు అన్నారు. కాని ప్రేక్షకుల గురించి ఆలోచన చేయలేదని వివరించారు. ప్యాండమిక్‌ సమయంలో ప్రేక్షకులు బాగా ఎడ్యూకేట్‌ అయ్యారని, వారికి తగ్గ స్థాయిలో సినిమాలు తీస్తేనే మెప్పించగలమనే భావన నిర్మాతల్లో వ్యక్తమైందని దిల్‌రాజు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా