ఇలాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు.. అందుకే ఉపేంద్రని తీసుకున్నామన్న దర్శకుడు
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇప్పుడు సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. కొన్నాళ్లుగా డిజాస్టర్లతో సతమతమవుతున్న రామ్.. హిట్టు కొట్టి చాలా ఏళ్లు అవుతుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రామ్.. ఆ తర్వాత నటించిన స్కంధ, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. హై-ఆక్టేన్ ఎనర్జీ, రొమాన్స్, అభిమానులతో కూడిన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, నాలుగు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్ బాబు పి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఏం సినిమా రా బాబు.! భయంతో వాంతులు చేసుకోవడం ఖాయం.. ఎక్కడ చూడొచ్చంటే
ఈ సినిమాకి ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ కి చాలా మీనింగ్ ఉంది. అది మీరు సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా 2002 టైంలో జరుగుతుంది. అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉండేవి. కాబట్టి అలా పెట్టడం జరిగింది. కన్నడలో కూడా ఈ సినిమాని అదే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నాం.. ఈ సినిమాకి ముందు ‘ఆంధ్ర కింగ్’ పేరు పెట్టుకున్నాను. ఒక సీన్ రాస్తున్నప్పుడు అందులో ఎవరి తాలూకా అని డైలాగ్ వస్తుంది. అప్పుడు హీరో తన ఐడెంటిటీగా ఐడెంటిటీ గా ఫీల్ అవుతున్న ఎమోషన్ ని ఆంధ్ర కింగ్ తాలూకా అని పెట్టడం జరిగింది.
లక్ అంటే ఈ బ్యూటీదే.. స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న క్రేజీ హీరోయిన్.. 11ఏళ్ల తర్వాత ఇలా..
ఆంధ్ర కింగ్ క్యారెక్టర్ కోసం ఉపేంద్ర గారిని తీసుకోవడానికి కారణం ఏంటి అని అడిగిన ప్రశ్నకు. రానా గారు ఉపేంద్ర గారితో ఒక ఇంటర్వ్యూ చేయడం చూశాను. అందులో ఉపేంద్ర గారు ‘నేను బయటకంటే సినిమాలోనే రియల్ మనిషి’ అని చెప్పారు. ఆ మాట నాకు చాలా కనెక్ట్ అయింది. అప్పుడే సూర్య అనే క్యారెక్టర్ ఇలా ఉంటుంది అనిపించింది. సూర్య పాత్ర కోసం మేము ఆయన్నే సంప్రదించాము. ఉపేంద్ర గారికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. సూర్యలో అందరు స్టార్స్ కనిపిస్తారు. ఉపేంద్ర గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయన్ని కలిసిన తర్వాత ఆయన గురించి మరింత తెలుసుకున్నాను. ఒక్క పర్సన్, ఇన్సిడెంట్ అని చెప్పలేను. చాలా రోజుల క్రితం ఒక సినిమాకి వెళ్లాను. ఆ సినిమా నాకు అంతగా నచ్చలేదు. కానీ నా పక్కన ఉన్న ప్రేక్షకుడు ఆ డైలాగులకు చాలా ఇన్స్పైర్ అవుతున్నాడు. ప్రతి డైలాగ్ కి కనెక్ట్ అవుతున్నాడు, నిజానికి అక్కడ ఉన్న హీరోతో తనకి పర్సనల్గా ఎటువంటి కనెక్షన్ ఉండదు. కానీ తను చెప్పే ప్రతి మాటకి ఇన్స్పైర్ అవడం అనేది నాకు చాలా కనెక్టింగ్ గా అనిపించింది. అలాంటి కథని ఎవరూ చెప్పలేదనిపించింది. సౌత్ ఇండియాలో హీరోస్ ని మన జీవితంలో ఒక అంతర్భాగంగా చూస్తాం. అందులో నాకు చాలా ఎమోషన్స్ కనిపించాయి. అలా ఆ ఇద్దరి రిలేషన్ లో ఒక కథ చెప్పొచ్చు అనిపించింది. ఫ్యాన్ ని ఆధారంగా చేసుకుని కొన్ని సినిమాల్లో వచ్చాయి కానీ ఇలాంటి కథతో సినిమా ఇప్పటివరకు సినిమా రాలేదు. ఇందులో నేను చెబుతున్న కథ కంప్లీట్ డిఫరెంట్, చాలా యూనిక్ అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు మహేష్ బాబు పి.
రోజూ రాత్రి అలా చేయకపోతే నాకు నిద్రపట్టదు.. ఫిజికల్ టచ్ ఉండాల్సిందే అంటున్న బ్యూటీ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
