AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందమే ఆమెకు శాపంగా మారింది.. అవకాశాలు ఇవ్వని డైరెక్టర్స్..! ఎమోష్నలైన హీరోయిన్..

హీరోయిన్స్ చాలా మంది తమ అందంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. చాలా మంది గ్లామరస్ పాత్రల్లో కనిపించి అలరిస్తున్నారు. కాగా ఓ హీరోయిన్ మాత్రం తన అందం కారణంగా ఆఫర్స్ రాకుండా పోయాయి అని తెలిపింది. ఆమె అందమే తనకు శాపంగా మారింది అని చెప్పుకొచ్చింది.

అందమే ఆమెకు శాపంగా మారింది.. అవకాశాలు ఇవ్వని డైరెక్టర్స్..! ఎమోష్నలైన హీరోయిన్..
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 25, 2025 | 10:45 AM

Share

సినీపరిశ్రమలో హీరోయిన్‏గా వెలిగిపోవాలంటే అందం, ఫిట్నెస్ ముఖ్యమే అని చాలా మంది నమ్మకం. నిజానికి సినీరంగుల ప్రపంచంలో నటిగా ఓ వెలుగు వెలగాలంటే టాలెంట్ తోపాటు అదృష్టం కూడా కావాలిస. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే ఓ నటికి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది. అందం, అంతకు మించిన టాలెంట్ ఉన్నప్పటికీ ఆమెకు సినిమాల్లో అంతగా అవకాశాలు రాలేదు. ఆమె అందమే ఆమెకు శత్రువుగా మారిందని తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఆమె ఎక్కువ అందంగా ఉన్నందుకు ఆమెను ఆనేక చిత్రాల నుంచి తొలగించారు. అందంగా ఉందని సినిమాల నుంచి తీసేయడం ఏంటి అనుకుంటున్నారా.? అవును నిజం. చాలా మంది డైరెక్టర్స్ ఆ నటిని ‘మెయిన్ స్ట్రీమ్ ‘ నుంచి తీసేశారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

ఏం సినిమా రా బాబు.! భయంతో వాంతులు చేసుకోవడం ఖాయం.. ఎక్కడ చూడొచ్చంటే

ఆమె మరెవరో కాదు. తనే బాలీవుడ్ నటి దియా మీర్జా. ఈబ్యూటీ తండ్రి జర్మన్, తల్లి బెంగాలీ. దియా మిశ్రా తల్లిదండ్రులు కొన్నాళ్లకే విడిపోవడంతో తల్లి మరో పెళ్లి చేసుకుంది. అందుకే ఈ అమ్మడు తన తల్లిదండ్రుల ఇంటిపేరును ఉపయోగించుకోలేదు. 2001లో, మాధవన్, రీమాసేన్ నటించిన తమిళ సూపర్ హిట్ మిన్నెలే మూవీ హిందీ రీమేక్ లో నటించింది. ఈ చిత్రాన్ని హిందీలో రెహనా హై తేరే దిల్ మే’ తెరకెక్కించగా.. ఇందులో మాధవన్ సరసన నటించడం ద్వారా హిందీ చిత్రసీమలో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. సినిమాలో మాధవన్, దియా మధ్య కెమిస్ట్రీ హిట్ అయ్యింది. మొదటి చిత్రంలో నటి అందం, నటన గురించి మాట్లాడుకున్నారు.

లక్ అంటే ఈ బ్యూటీదే.. స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న క్రేజీ హీరోయిన్.. 11ఏళ్ల తర్వాత ఇలా..

అయితే ఈ మూవీ తర్వాత ఆఫర్స్ తగ్గిపోయాయి. నట దియా మీర్జా విపరీతమైన అందం కారణంగా చాలా సినిమాల అవకాశాలు కోల్పోయింది. నటి దియా మీర్జా మంచి కథతో అర్థవంతమైన చిత్రాలపై ఆసక్తిని కనబరిచింది, అయితే ఆ పాత్ర కోసం ఆమె చాలా అందంగా ఉంది. అంత అందమైన అమ్మాయి సినిమాకు సెట్ అవ్వదు అని చిత్ర దర్శకులు ఆమెను తిరస్కరించారు. ఓ ఇంటర్వ్యూలో నటి దియా మీర్జా మాట్లాడుతూ.. ‘ దర్శకులు నన్ను ‘మెయిన్ స్ట్రీమ్’ నటిగా చూశారు కాబట్టి నేను కోరుకున్న మంచి కథతో సినిమాలో నటించే అవకాశం రాలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె విపరీతమైన అందం కారణంగా ఎన్నో మంచి చిత్రాల్లో అవకాశాలు రాకుండాపోయాయి అని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.

రోజూ రాత్రి అలా చేయకపోతే నాకు నిద్రపట్టదు.. ఫిజికల్ టచ్ ఉండాల్సిందే అంటున్న బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.