
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇటీవల మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ మూవీ మురారి సినిమాను రీరిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఎప్పటిలాగే థియేటర్లలో నానా హంగామా చేశారు ఫ్యాన్స్. మురారి సినిమా పాటలకు అరుపులు, కేకలతో థియేటర్లో గోల గోల చేశారు. మురారి సినిమాలోని పెళ్లి సాంగ్ ప్లే అవుతుండగా.. స్క్రీన్ పైకి అక్షింతలు చల్లుతూ రచ్చ రచ్చ చేశారు. అయితే కొన్నాళ్లుగా థియేటర్లలో తమ హీరోల సినిమాలు రీరిలీజ్ అవుతుంటే ఫ్యాన్స్ మాత్రం గోల చేస్తున్నారు. అలాగే ఈ సినిమాల్లోని ఐకానిక్ సీన్స్ ను తెర ముందు రీక్రియేట్ చేస్తున్నారు. తాజాగా మురారి సినిమా రీరిలీజ్ థియేటర్లోనూ సూపర్ హిట్ పెళ్లి సాంగ్ ప్లే అవుతుండగా ఓ జంట రీక్రియేట్ చేసింది. ఓ థియేటర్లో మురారి సినిమాలోని అలనాటి రామచంద్రుడు సాంగ్ వస్తున్న సమయంలో ఓ జంట పెళ్లి చేసుకుంది.
అమ్మాయి మెడలో అబ్బాయి తాళి కట్టగా చుట్టూ ఉన్నవాళ్లంతా అక్షింతలు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా..పలువురు నెటిజన్స్ సదరు జంటగా మండిపడుతున్నారు. థియేటర్లో పెళ్లి చేసుకోవడం సూపర్ అంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంజగా.. పెళ్లిని ఇలా అపహాస్యం చేస్తున్నారని.. అభిమానం ఉండొచ్చు కానీ ఇలా ఉండకూడదంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ వీడియోను ఓ నెటిజన్ షేర్ చేస్తూ డైరెక్టర్ కృష్ణవంశీని ట్యాగ్ చేశారు. ఇది చూశారా థియేటర్లలో పెళ్లి చేసుకున్నారు అంటూ రాసుకొచ్చాడు. ఈ వీడియోను చూసిన కృష్ణవంశీ మహేష్ ఫ్యాన్స్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.
ఇది కరెక్ట్ కాదు.. మన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను అపహాస్యం చేయడం, అవమానించడం చేయకండి ప్లీజ్ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో డైరెక్టర్ కృష్ణవంశీ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది. కృష్ణవంశీ చేసిన కామెంట్స్ కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కొన్ని రోజులుగా స్టార్ హీరోస్ సినిమాలు రీరిలీజ్ అవుతుండగా.. థియేటర్లలో నానా హంగామా చేస్తున్నారు ఫ్యాన్స్.
Not good … Dnt ridicule n insult n abuse our great grand CULTURE and TRADITIONS plzzzzz ,🙏🙏🙏🙏 https://t.co/CoTJ0tkX3c
— Krishna Vamsi (@director_kv) August 10, 2024
Cinema craze in Telugu states is vere level ….
Young couple getting married in theatre at #Murari4K re-release 🔥🔥🔥
Madness ? Yes – madness for #MaheshBabu
— Vineeth K (@DealsDhamaka) August 9, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.