Virupaksha: త్వరలోనే విరూపాక్ష 2.. సాయిధరమ్ తేజ్ తో పాటు ఆ మెగా హీరో కూడా..
విరూపాక్ష సినిమా గురించే. తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. హారర్ జోనల్ లో తెరకెక్కిన ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. బ్యాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన విరూపాక్ష సినిమా ప్రేక్షకులను బాగానే భయపెట్టింది. ఈ సినిమా తర్వాత తాజాగా బ్రో సినిమాతో సక్సెస్ ఆదుకున్నాడు తేజ్. పవన్ కళ్యాణ్ , తేజ్ కలిసి నటించిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తేజ్ ఎవరితో సినిమా చెయ్యబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.

మెగా మేనల్లుడు స్;ఐ ధరమ్ తేజ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ఇప్పుడు పూర్తిగా కోలుకొని తిరిగి సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇప్పటికే రెండు హిట్స్ అందుకున్నాడు తేజ్. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది. విరూపాక్ష సినిమా గురించే. తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. హారర్ జోనల్ లో తెరకెక్కిన ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. బ్యాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన విరూపాక్ష సినిమా ప్రేక్షకులను బాగానే భయపెట్టింది. ఈ సినిమా తర్వాత తాజాగా బ్రో సినిమాతో సక్సెస్ ఆదుకున్నాడు తేజ్. పవన్ కళ్యాణ్ , తేజ్ కలిసి నటించిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తేజ్ ఎవరితో సినిమా చెయ్యబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే విరూపాక్ష సీక్వెల్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది.
సూపర్ హిట్ గా నిలిచిన విరూపాక్ష సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడట దర్శకుడు కార్తీక్ దండు. విరూపాక్ష సినిమాకు సీక్వెల్ ఉంటుందని సినిమా చివరిలో చిన్న హింట్ కూడా ఇచ్చాడు ఈ దర్శకుడు. ఇప్పుడు ఆ సీక్వెల్ కోసం కథను సిద్ధం చేస్తున్నాడట. అంతే కాదు ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో పాటు మరో హీరో కూడా నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.
View this post on Instagram
విరూపాక్ష 2 లో ప్రేక్షకులను మరింతగా భయపెట్టేలా కథను సిద్ధం చేసుకుంటున్నాడట కార్తీక్. విరూపాక్ష సీరీస్ ని కొనసాగించాలని చూస్తున్నాడట కార్తీక్. అయితే విరూపాక్ష 2లో నటించే మరో హీరో ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో మరో హీరోనా మెగా హీరోనే నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నదని ప్రకారం ఈ మూవీలో తేజ్ తో పాటు వరుణ్ తేజ్ కూడా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రీసెంట్ గా గాండీవదారి అర్జున అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వరుణ్ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు విరూపాక్ష 2 లో నటిస్తున్నాడని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.