AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Shankar: ‘అది నిజం కావాలని ఆశిద్దాం’.. హరీష్‌ శంకర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

హరీష్ శంకర్‌ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కిన చిత్రం మిస్టర్ బచ్చన్‌. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదుల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.ఈ నేపథ్ంలో సినిమా ప్రమోషన్స్‌లోపాల్గొన్న హరీష్‌ శంకర్‌ పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు. మల్టీస్టారర్‌ మూవీ తీయాల్సి వస్తే..

Harish Shankar: 'అది నిజం కావాలని ఆశిద్దాం'.. హరీష్‌ శంకర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌
Harish Shanker
Narender Vaitla
|

Updated on: Aug 06, 2024 | 3:13 PM

Share

తెలుగు ప్రేక్షకులకు మల్టీ స్టారర్‌ మూవీస్‌ కొత్తేం కాదు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ మొదలు మొన్నటికి మొన్న వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌ వరకు.. అసలు సిసలైన మల్టీ స్టారర్‌ మూవీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ట్రిపులార్‌ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు కలిసి నటించి అభిమానులను ఫిదా చేశారు. ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు హరీష్‌ శంకర్‌ మరో ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్‌ మూవీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.

హరీష్ శంకర్‌ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కిన చిత్రం మిస్టర్ బచ్చన్‌. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదుల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.ఈ నేపథ్ంలో సినిమా ప్రమోషన్స్‌లోపాల్గొన్న హరీష్‌ శంకర్‌ పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు. మల్టీస్టారర్‌ మూవీ తీయాల్సి వస్తే.. ఎవరితో తీస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ.. పవన్ కళ్యాణ్‌, రవితేజలతో చేస్తానని ఠక్కున తెలిపారు. సాధారణంగా వీరిద్దరిలో ఏ ఒక్కరు తెరపై కనిపించినా మాస్‌ ప్రేక్షకులు విజిల్స్‌ హోరెత్తిస్తారు. అలాంటిది ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే, పూనకాలతో ఊగిపోవడం ఖాయమని చెప్పుకొచ్చారు.

అయితే ఈ విషయం కాస్త సోషల్‌ మీడియాలోనూ తెగ ట్రెండ్‌ అయ్యింది. దీంతో హరీష్‌ శంకర్‌ ఓ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. తనను చాలా మంది పవన్‌, రవితేజలతో సినిమా చేయాలని అడిగారని, అది కార్యరూపం దాల్చాలని ఆశిద్దాం అంటూ చెప్పుకొచ్చారు. ఇక మహేశ్‌ బాబుతోనూ ఒక సినిమా చేయాలని తనకు ఉందని హరీష్‌ తెలిపారు. అదే తన చిరకాల స్వప్నమని హరీష్‌ శంకర్‌ చెప్పుకొచ్చారు.

ఇక గతంలో తన దర్శకత్వంలో వచ్చి, ఫెయిల్ అయిన సినిమాలపై మాట్లాడిన హరీష్‌ శంకర్‌.. కొన్ని సందర్భాల్లో తాను దర్శకుడిగా ఫెయిల్‌ అయి ఉండవచ్చని, కానీ, తన సినిమాల విషయంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ ఎప్పుడూ ఫెయిల్‌ కాలేదని హరీశ్ శంకర్‌ చెప్పుకొచ్చారు. కాగా మిస్చర్‌ బచ్చన్ చిత్రాన్ని బాలీవుడ్‌లో విజయం సాధించిన రైడ్‌ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమాతో హరీష్‌ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..