SitaRamam: ‘ఆ హీరోలను కలిసింది సీతారామం కోసం కాదు’.. ఆసక్తికర కామెంట్స్ చేసిన డైరెక్టర్ హనురాఘవపూడి..
ఇక వాళ్లకు డేట్స్ కుదరకపోవడంతో ఈ ఆఫర్ దుల్కర్‌కు వచ్చిందంటూ రూమర్స్ వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించారు డైరెక్టర్ హాను రాఘవపూడి.
మలయాళీ స్టా్ర్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా సీతారామం. (SitaRamam) దేశవ్యాప్తంగా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్న సినిమాగా విడుదలై భారీగానే వసూళ్లు రాబట్టింది. అలాగే డైరెక్టర్ హాను రాఘవపూడి స్క్రీన్ ప్లే, దుల్కర్ సల్మాన్, మృణాల్ నటనకు ప్రశంసలు వచ్చాయి. అంతేకాకుండా ఈ మూవీలోని సాంగ్స్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఓవైపు హిందీలో.. మరోవైపు ఓటీటీలో సత్తా చాటుతుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ కోసం ముందుగా నానీ, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేనిని అనుకున్నారని.. అందుకు వారందరిని డైరెక్టర్ సంప్రదించారని.. ఇక వాళ్లకు డేట్స్ కుదరకపోవడంతో ఈ ఆఫర్ దుల్కర్‌కు వచ్చిందంటూ రూమర్స్ వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించారు డైరెక్టర్ హాను రాఘవపూడి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హను రాఘవపూడికి సైతం ఈ ప్రశ్న ఎదురైంది.అందుకు ఆయన స్పందిస్తూ.. నేను నానీని కలిసిన మాట నిజమే. అలాగే విజయ్ దేవరకొండను, రామ్ పోతినేనిని కూడా కలిసిన మాట వాస్తవమే. వాళ్లతో చర్చలు జరిపిన మాట కూడా నిజమే.. కానీ ఈ కథ కోసం మాత్రం కాదు. వాళ్లందరికీ వేరే కథలు చెప్పాను. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలోని స్టోరీని నానీకి చెప్పాను. అలాగే విజయ్, రామ్ కు కూడా వేర్వేరు స్టోరీస్ చెప్పాను. కానీ సీతారామం సినిమాకు ముందునుంచి అనుకున్నది దుల్కర్ ను మాత్రమే. మరెవరిని ఈ కథ కోసం కలవలేదు. నా తదుపరి సినిమా నానీతో కచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఎప్పుడనేది చెప్పలేను అంటూ చెప్పుకొచ్చారు.