AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sehari​ Movie: సినిమా మొదలైన రెండు నిమిషాలకే సెహరి ప్రపంచంలోకి వెళ్తారట..

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ‘సెహరి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక.

Sehari​ Movie: సినిమా మొదలైన రెండు నిమిషాలకే సెహరి ప్రపంచంలోకి వెళ్తారట..
Sehari
Rajeev Rayala
| Edited By: |

Updated on: Feb 04, 2022 | 8:34 AM

Share

Sehari​ Movie: హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా సెహరి. అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ‘సెహరి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక. వర్గో పిక్చర్స్‌ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హ‌ర్ష్ క‌నుమిల్లి ఈ చిత్రానికి క‌థా ర‌చ‌యితగా వ్య‌వ‌హ‌రించారు. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 11న గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌నున్నారు. ఈ క్రమంలో దర్శకుడు జ్ఞానశేఖర్‌ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సెహరి అంటే సెలెబ్రేషన్. అన్ని భాషల్లో ఈ పదానికి అర్థం ఉంది. మేం సంస్కృతం నుంచి తీసుకున్నాం అన్నారు. సిద్దార్థ్ నటించిన ఓయ్ సినిమాలో పాట వల్ల సెహరి ఇంకా ఫేమస్ అయింది. నేను గత ఆరేళ్ల నుంచి యాడ్ ఫిల్మ్ మేకింగ్‌లో ఉన్నాను. ఇదే నా మొదటి చిత్రం. అనుకున్న టైంలోనే సినిమాను తీశాం. కానీ ప్యాచ్ వర్క్‌ కాస్త లేట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాస్త ఆలస్యంగా జరిగింది. అందుకే సినిమా రిలీజ్‌ లేట్ అయింది అని అన్నారు.

హీరో హర్ష అందించిన కథతోనే సినిమాను తీశాను. రామ్ కామ్ అని చెప్పడంతో పెద్ద అంచనాలు పెట్టుకుని కథ వినలేదు. కానీ కథ చాలా నచ్చింది. ఆ తరువాత చిన్న చిన్న మార్పులు చేసుకుని ఈ సినిమాను తీశాను. కథ విన్న వెంటనే చేసేస్తాను అని చెప్పాను. ప్రీ ప్రొడక్షన్ కోసమే మూడు నెలలు పని చేశాం అన్నారు. నేను రచయితను. కొన్ని కథలు రాసుకున్నాను. నాకు సినిమాల మీదే ఇంట్రెస్ట్. కానీ హర్ష్ ఈ కథ చెప్పినప్పుడు ఎంతో ఫ్రెష్‌గా అనిపించింది. కథ విన్న వెంటనే బాగా నచ్చింది. అందుకే నా కథలు పక్కన పెట్టి ఈ సినిమాను చేశాను. యుక్త వయసులో అబ్బాయి మనస్తత్వం, ప్రేమ, బ్రేకప్ వంటి అంశాల మీద తెరకెక్కించాం. రెండున్నర గంటలు సినిమా అద్భుతంగా ఉంటుంది. సినిమా ప్రారంభమైన రెండు నిమిషాలకే సెహరి ప్రపంచంలోకి వెళ్తారు. థియేటర్ల నుంచి బయటకు వచ్చే సరికి అందరి మొహాల మీద చిరునవ్వు ఉంటుంది. సినిమాలో విజువల్స్ అద్బుతంగా వచ్చాయి. ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరూ విజువల్స్‌ బాగున్నాయని అంటున్నారు. రఫ్ కట్ చూసినప్పుడే సినిమా మీద నమ్మకం వచ్చేసింది. ప్రశాంత్ విహారి ఇచ్చిన ఆల్బమ్ అద్భుతంగా వచ్చింది అని చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

FIR Trailer: అమాయకుడి జీవితాన్ని తలకిందులు చేసిన అనుమానం.. ఆసక్తికరంగా ఎఫ్‌ఐఆర్‌ ట్రైలర్‌..

Childhood Pic:ఈ ఫోటో ఆ పాత మధురం.. అమ్మగా, బామ్మగా సిని ప్రేక్షకులకు సుపరిచితం.. ఎవరో గుర్తు పట్టరా..

Vaishnav Tej: మెగా హీరో సినిమా నుంచి మరో అప్డేట్‌.. అలరిస్తోన్న రంగ రంగ వైభవంగా మెలోడీ సాంగ్‌..

Follow Us