Dhruva Nakshtram: గౌతమ్ మీనన్‌ను వదలని కష్టాలు.. ‘ధృవ నక్షత్రం’ రిలీజ్ కావాలంటే రూ.2 కోట్లు కట్టాల్సిందే..
'ధృవ నక్షత్రం' సినిమా విడుదలకు సైతం అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోన్న ఈ మూవీ మరోసారి రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యింది. ఈ సినిమా విడుదలకు ముందు కోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తగిలింది. ఈ మూవీ విడుదలకు ముందే నిర్మాణ సంస్థ ఆల్ ఇన్ పిక్చర్స్‌కు తిరిగి చెల్లించే విషయంలో కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు ఉదయం 10:30 గంటలలోపు కోర్టులో రూ. 2.40 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించాలని, ధృవ నక్షత్రం సినిమాను సకాలంలో విడుదల చేయాలని గౌతమ్ మీనన్‌ని కోర్టు ఆదేశించింది.

డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్‌ను ఆర్థిక కష్టాలు ఇప్పట్లో వదిలి పెట్టేలా లేవు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆయన తెరకెక్కించిన ‘ధృవ నక్షత్రం’ సినిమా విడుదలకు సైతం అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోన్న ఈ మూవీ మరోసారి రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యింది. ఈ సినిమా విడుదలకు ముందు కోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తగిలింది. ఈ మూవీ విడుదలకు ముందే నిర్మాణ సంస్థ ఆల్ ఇన్ పిక్చర్స్‌కు తిరిగి చెల్లించే విషయంలో కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు ఉదయం 10:30 గంటలలోపు కోర్టులో రూ. 2.40 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించాలని, ధృవ నక్షత్రం సినిమాను సకాలంలో విడుదల చేయాలని గౌతమ్ మీనన్‌ని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఈ సినిమాకు మరిన్ని ఆర్థిక కష్టాలు చుట్టుమూడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్, డిజిటల్ హక్కులు ఇంకా కొనుగోలు కాలేదు. దీంతో ఇప్పుడు ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్‌పై ప్రభావం చూపడంతో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది.
ధృవ నక్షత్రం విడుదల విషయంలో దర్శకుడికి ఈరోజు వచ్చిన కోర్టు ఆదేశం నిజంగానే విభేదాలు తెచ్చిపెట్టింది . చిత్రనిర్మాత తన చిత్రాన్ని నిర్ణయించిన సమయంలో విడుదల చేయాలంటే ఇచ్చిన నిబంధనలకు కట్టుబడి ఉండాలిఈ చిత్రం 2016 నుండి మేకింగ్‌లో ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ఈ మూవీ ఇప్పుడు విడుదల కాబోతుందని అంతా అనుకున్నారు. సినిమా వీక్షణ అనుభవం, కథాంశంపై ప్రభావం చూపదని దర్శకుడు చెప్పినప్పటికీ, సినిమా పదే పదే ఆలస్యం అవడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయింది.
Court order: GVM should repay the advance of 2.40crs which he got previously from ‘All In Pictures’ (Border producer) to do a movie. He should repay before 10.30AM tomorrow morning in court and he can release the film
Moreover DN has its own financial…
— AmuthaBharathi (@CinemaWithAB) November 23, 2023
ఆసక్తికరమైన విషయమేమిటంటే, గౌతమ్ మీనన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల ద్వారా చిత్రాన్ని చురుకుగా ప్రమోట్ చేస్తున్నప్పటికీ, ప్రధాన నటుడు చియాన్ విక్రమ్ ఎటువంటి ప్రచార కార్యక్రమాలలో పాల్గొనలేదు. అటు సోషల్ మీడియాలోనూ ఈ చిత్రం గురించి ఏదైనా పోస్ట్ చేయడంలేదు. విక్రమ్ ఈ సినిమాపై అంతగా శ్రద్ధ పెట్టకపోవడంతో అభిమానులలో కొంత అసహనానికి దారితీసింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ రచన, నిర్మాణం, దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో చియాన్ విక్రమ్, రీతూ వర్మ, ఆర్ పార్తిబన్, సిమ్రాన్, రాదికా శరత్‌కుమార్, వినాయకన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతాన్ని అందించారు.
#DhruvaNatchathiram #DhruvaNakshathram pic.twitter.com/dmD4ndEnp9
— Gauthamvasudevmenon (@menongautham) November 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
