Japan Movie: కార్తీ ‘జపాన్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
తమిళంతోపాటు తెలుగులోనూ మంచి హైప్ పై రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. నటనపరంగా కార్తీ మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఈ మూవీ కమర్షియల్ గా అంతగా హిట్ కాలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. విడుదలై నెలరోజులు గడవకముందే జపాన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 1 లేదా 8న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఖైధీ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు కోలీవుడ్ హీరో కార్తీ. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక అదే జోష్ తో ఇటీవల జపాన్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిల్చింది. తమిళంతోపాటు తెలుగులోనూ మంచి హైప్ పై రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. నటనపరంగా కార్తీ మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఈ మూవీ కమర్షియల్ గా అంతగా హిట్ కాలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. విడుదలై నెలరోజులు గడవకముందే జపాన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 1 లేదా 8న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. త్వరలోనే ఈ విషయాన్ని అనౌన్స్ చేయనున్నట్లు తెలస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ.20 కోట్లకు సొంతం చేసుకున్నట్లు టాక్. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారట.
Makkale! Here’s #TouchingTouching song video💛
Tamil – https://t.co/rOchPMSIN9 Telugu – https://t.co/Y8jlqELku8@gvprakash @Indravathichauh @ItsAnuEmmanuel @Dir_Rajumurugan @DreamWarriorpic pic.twitter.com/Y1mr7GohyW
— Karthi (@Karthi_Offl) November 8, 2023
ఇదిలా ఉంటే.. డైరెక్టర్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. ఇందులో సునీల్, విజయ్ మిల్టన్ కీలకపాత్రలు పోషించారు. ఈసినిమాలో హీరో కార్తీకి బంగారం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ దొంగతనాలు చేస్తూ ఆ డబ్బుతో జల్సాగా జీవిస్తుంటాడు. అయితే ఉన్నట్లుండి అతడు రూ.200 కోట్ల విలువైన బంగారం దొంగతనం చేశాడని నిందపడుతుంది. చేయని నేరం నుంచి కార్తీ ఎలా తప్పించుకున్నాడనేది జపాన్ చిత్రం. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతుంది.
Get ready to embark on ‘The Journey Of #Karthi’! #Karthi25 on @vijaytelevision tomorrow at 3 PM. Fun times ahead 🤩 #JapanDiwali💥#JapanFromNov10 @Karthi_Offl @ItsAnuEmmanuel @vagaiyaar @ksravikumardir #Sunil @vijaymilton @sanalaman @gvprakash @dop_ravivarman @ActionAnlarasu… pic.twitter.com/n9dZzCJp0m
— DreamWarriorPictures (@DreamWarriorpic) November 4, 2023
And it’s here! This one was memorable and tough to shoot for me Touching Touching 🔥❤️ https://t.co/JWSvZZA1OP
— Anu Emmanuel (@ItsAnuEmmanuel) November 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




