Sunil : ఆ సినిమా సునీల్‌కు సెట్ అయ్యేది కాదు.. అయినా తీయడానికి కారణం ఇదే.. డైరెక్టర్ దేవి ప్రసాద్..
నటుడిగా, దర్శకుడిగా తెలుగు సినీరంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు దేవి ప్రసాద్. ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే తన కెరీర్ లో వచ్చిన గ్యాప్ గురించి.. తన సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సునీల్ మూవీస్ గురించి స్పందించారు.

దర్శకుడు దేవి ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు సినిమాలతో అలరించిన ఆయన.. ఇప్పుడు సీరియల్స్ ద్వారా బిజీగా ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. పెళ్లి కొడుకు సినిమా పరాజయానికి గల కారణాలను వెల్లడించారు. ఈ సినిమా హీరో సునీల్‌కు తగిన కథ కాదని, ప్రేమ కథా చిత్రంలో ఆయన సాడ్ పాత్ర పోషించడం వర్కౌట్ అవ్వదని తాను ముందుగానే నిర్మాత ఆర్.బి. చౌదరికి చెప్పినట్లు తెలిపారు. అయితే, నిర్మాత నమ్మకంతో సినిమా చేయగా, అది ఆశించిన ఫలితం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ పరాజయం తర్వాత తన కెరీర్‌లో నాలుగేళ్ల విరామం వచ్చిందని, ఇతర అవకాశాలు కూడా కోల్పోయానని దేవి ప్రసాద్ వెల్లడించారు. ఒక సినిమాపై దృష్టి పెట్టడం వల్ల ఇతర ప్రాజెక్ట్‌లను తిరస్కరించినట్లు తెలిపారు. బాలకృష్ణతో అనుకున్న సినిమా కూడా “మిస్టర్ పెళ్ళికొడుకు” ఫ్లాప్ తర్వాత నిలిచిపోయిందని, ఆ అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేసినట్లు చెప్పారు. సినీ పరిశ్రమలో ఇలాంటివి సహజమని, ఎవరినీ తప్పుబట్టడానికి లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎక్కువ మంది చదివినవి : Director Krishnavamsi : ఖడ్గం సినిమాలో ఆమె పాత్ర నిజమే.. ఆ సీన్ ఎందుకు చేశామంటే.. డైరెక్టర్ కృష్ణవంశీ..
తన కెరీర్‌లో లేడీ బాబీజీ, లీలామహల్ సెంటర్, ఆడుతూ పాడుతూ వంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నప్పటికీ, దర్శకుడిగా అనుకున్నన్ని సినిమాలు చేయలేకపోయానని దేవి ప్రసాద్ అన్నారు. దీనికి ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదని, తనకు వచ్చిన అవకాశాలను సరైన వ్యక్తులు, కథలు కుదరకపోవడం వల్ల అందిపుచ్చుకోలేకపోయానని ఆయన వివరించారు. మిస్టర్ పెళ్ళికొడుకు తర్వాత తమిళంలో రెండు హీరోల సినిమా చేయమని సూపర్ గుడ్ ఫిల్మ్స్ అడిగినా, మళ్ళీ మరో ఫ్లాప్ సినిమా ఎందుకు చేయాలని తిరస్కరించినట్లు తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Actress : హీరోయినే అసలు విలన్.. కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
నందమూరి బాలకృష్ణతో చేయాల్సిన ఒక సినిమా నిలిచిపోవడం గురించి కూడా దేవి ప్రసాద్ మాట్లాడారు. ఆ సినిమా కథ తనది కాదని, వేరే వారిది అని, అంతా ఓకే అనుకొని రెండు, మూడు మీటింగ్ లు జరిగిన తర్వాత మిస్టర్ పెళ్ళికొడుకు విడుదలయ్యి, విజయం సాధించకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి వద్దు అని నిర్మాతలు చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత వారు వేరే డైరెక్టర్‌తో ప్రయత్నాలు చేస్తున్నారని తనకు తెలిసిందని, ఎందుకు ఆగిపోయిందో తాను ఎప్పుడూ అడగలేదని దేవి ప్రసాద్ తెలిపారు. బాలకృష్ణ సినిమాల్లో (కథానాయకుడు, మహానాయకుడు) నటుడిగా నటించినప్పుడు కూడా ఈ విషయం గురించి మాట్లాడుకున్నామని, అయితే దాని వెనుక గల కారణాలను తాను తెలుసుకోవడానికి ప్రయత్నించలేదని చెప్పారు. బాలకృష్ణ సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్‌ను చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ఇచ్చేశానని, ఎవరి డబ్బు తన దగ్గర ఉన్నా మనశ్శాంతి ఉండదని ఆయన వివరించారు. ఒక ప్రాజెక్ట్‌కు కమిట్ అవ్వడం వల్ల ఆ సమయంలో వచ్చిన ఇతర మంచి అవకాశాలను కూడా తాను కోల్పోయి నష్టపోయానని, అయితే సినీ పరిశ్రమలో ఇలాంటివి సర్వసాధారణమని, ఎవరినీ తప్పుపట్టడానికి లేదని దేవి ప్రసాద్ తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Nayanthara – Trisha : 40 ఏళ్ల వయసులో చెక్కు చెదరని సోయగం.. నెట్టింట లేడీ సూపర్ స్టార్స్ సందడి.. నయనతార, త్రిష ఫోటోస్ వైరల్..
ఎక్కువ మంది చదివినవి : Premi Vishwanath: నేను మా ఆయన అందుకే కలిసి ఉండము.. కార్తీక దీపం ఫేమ్ వంటలక్క..
