Buchi Babu Sana: బుచ్చి బాబు నెక్ట్స్ సినిమా పై సస్పెన్స్.. ఇప్పటికైనా క్లారిటీ వచ్చేనా..?
ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడన్నది ఇప్పాయి వరకు క్లారిటీ లేదు. అయితే బుచ్చి బాబు ఎన్టీఆర్ తో సినిమా చేస్తారని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆలాగే రామ్ చరణ్ తో సినిమా చేస్తాడని కూడా అంటున్నారు.
ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడిగా పరిచయమైనా ఈ డైరెక్టర్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు,అందమైన ప్రేమ కథగా ఉప్పెన సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రసంశలు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడన్నది ఇప్పాయి వరకు క్లారిటీ లేదు. అయితే బుచ్చి బాబు ఎన్టీఆర్ తో సినిమా చేస్తారని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆలాగే రామ్ చరణ్ తో సినిమా చేస్తాడని కూడా అంటున్నారు. ఈ ఇద్దరిలో ఒకరితో బుచ్చి బాబు సినిమా పక్కా ఉంటుందని టాక్. అయితే ఇప్పటికే తారక్ కు స్టోరీ వినిపించగా ఆ సినిమాను రిజక్ట్ చేశాడని టాక్ వినిపిస్తుంది. అయితే ఎన్టీఆర్ యొక్క ఇతర ప్రాజెక్టు కారణంగా బుచ్చిబాబు సినిమా ఆలస్యం అవుతుంది అంతా అనుకుంటున్నారు.. కానీ అసలు విషయం వేరే ఉందంటున్నారు.
నిజానికి బుచ్చిబాబు రెడీ చేసిన స్క్రిప్ట్ తారక్ కు నచ్చలేదట.. సెకండ్ హాఫ్ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడట. అయితే ఇదే స్టోరీని రామ్ చరణ్ కు వినిపించగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.
బుచ్చిబాబు రామ్ చరణ్ సినిమాపై ఈ రోజు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చరణ్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ తో సినిమా తర్వాత ఎన్టీఆర్.. బుచ్చిబాబు సినిమా ఉంటుందని రామ్ చరణ్ కి చెప్పిన కథ కొత్తది అంటూ వార్తలు వవినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత ఉంది అన్నది తెలియాల్సి ఉంది.