Tollywood: ట్రోల్ చేసినా పర్లే.. దుమ్ములేపుతున్న చిరు, బాలయ్య లేటెస్ట్ సాంగ్స్

ఓ వైపు మెగా అభిమానులు బాస్‌ పార్టీని సెలబ్రేట్ చేసుకుంటుంటే.. మరో వైపు నందమూరి ఫ్యాన్స్‌ జై బాలయ్య అంటూ జోరు చూపిస్తున్నారు. ఓ వైపు అభిమానుల సెలబ్రేషన్‌ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే.. మరో వైపు యాంటీ ఫ్యాన్స్ కాపీ ట్రోల్స్‌ను ట్రెండ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. మరి ఈ ట్రెండ్స్‌ వల్ల ఆ సాంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయా?

Tollywood: ట్రోల్ చేసినా పర్లే.. దుమ్ములేపుతున్న చిరు, బాలయ్య లేటెస్ట్ సాంగ్స్
Chiranjeevi - Balakrishna
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 28, 2022 | 10:00 AM

ఇటీవల మెగా అభిమానుల పార్టీ షురూ అయ్యింది. వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌ చేసిన మేకర్స్‌ ఫ్యాన్స్‌కు ఫుల్‌ కిక్కిచ్చారు. అయితే అదే సమయంలో పార్టీ సాంగ్‌ను టార్గెట్ చేస్తూ మీమ్స్ కూడా గట్టిగానే కనిపించాయి. సాంగ్‌లో దేవీ చెప్పిన డైలాగ్స్‌ మీద సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. చిరు ఎంట్రీ తరువాత షార్ట్ గ్యాప్‌లోనే బాలయ్య కూడా ఎంట్రీ ఇచ్చేశారు. వీర సింహా రెడ్డి సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ రిలీజ్ చేశారు. అభిమానుల కోసం మాస్ యాంథమ్ అంటూ రిలీజ్ చేసిన ఈ పాట నందమూరి ఫ్యాన్స్‌కు ఇన్‌స్టాంట్‌గా ఎక్కేసింది. అందుకే సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అయ్యింది జై బాలయ్య. పాజిటివ్‌ ట్రెండ్స్ ఏ రేంజ్‌లో వచ్చాయో.. నెగెటివ్ ట్రెండ్స్ కూడా అదే రేంజ్‌లో కనిపించాయి.

బాలయ్య పాట ఓల్డ్ సూపర్ హిట్ ఒసేయ్ రాములమ్మ పాటలా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్‌. అయితే ట్రెండ్స్ సంగతి ఎలా ఉన్నా అభిమానులకు మాత్రం బాలయ్య పాట నిజంగానే మాస్ యాంథమ్‌గా మారిపోయింది.

వరుసగా ఇద్దరు హీరోల పాటలు సోషల్ మీడియాలో టార్గెట్ కావటంతో ఆ ఎఫెక్ట్ ఎంత అన్న చర్చ మొదలైంది. ఈ విషయంలో నెగెటివ్ కన్నా.. పాజిటివ్‌ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందంటున్నారు విశ్లేషకులు. పాటలను ఎలా ట్రెండ్ చేసినా… రిజల్ట్ మాత్రం భారీ వ్యూస్‌గా మారుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందుకే అభిమానులు కూడా నెగెటివ్‌ ట్రోల్స్ విషయంలో పెద్దగా హర్ట్ అవ్వటం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..