Tollywood : క్యూట్‌నెస్ ఓవర్ లోడ్.. కురులమాటున దాగిఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..?
ఫ్యావరెట్ హీరోయిన్స్ సంబంధించిన ఫోటోలను ఫోనులలో దాచుకుంటూ ఉంటారు. చిన్ననాటి ఫొటోలనుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు అన్నింటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తుంటారు.
కుర్రకారు గుండెల్లో బాణాలు గుచ్చే ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. ఇక కుర్రకారు అయితే తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలోలను ఎంతో పదిలంగా దాచుకుంటూ ఉంటారు. ఫ్యావరెట్ హీరోయిన్స్ సంబంధించిన ఫోటోలను ఫోనులలో దాచుకుంటూ ఉంటారు. చిన్ననాటి ఫొటోలనుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు అన్నింటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తుంటారు. పైన కనిపిస్తున్న చిన్న దాని ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పైన కనిపిస్తున్న ముద్దగుమ్మను గుర్తుపట్టారా.. క్యూట్ గా కురుల మాటున దాగున్న కుర్రది ఎవరో గుర్తుపట్టారా.. ? ఈ భామ తెలుగు, తమిళ్ భాషల్లో చాలా ఫెమస్.. అడపాదడపా బాలివుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ.. కనిపెట్టడం అంత కష్టమేమీ కాదు.. మరి మీరు కనిపెట్టారా..?
ఈ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. టాలీవుడ్ టాల్ హీరోయిన్ శ్రుతిహాసన్. లోకనాయకుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతి. అనగనగా ఒక ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే హీరోయిన్ గా మెప్పించింది శ్రుతి. అందం అభినయం కలబోసిన ఈ భామ స్టార్ హీరోయిన్ గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మెప్పించిన ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది ఈ బ్యూటీ.
ప్రస్తుతం ఈ చిన్నది మెగాస్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ తో కలిసి వీరసింహారెడ్డి సినిమా చేస్తుంది ఈ మూవీ కూడా సంక్రాంతికి విడుదల కానుంది. ఇక రెండు సినిమాలతో సంక్రాంతి బరిలోకి దిగుతోంది శ్రుతి.