AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boyapati Srinu: బాలయ్య అభిమానులకు క్షమాపణలు చెప్పిన బోయపాటి.. కారణం ఇదే..

మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుల్లో ముందువరసలో ఉంటారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. రీసెంట్ గా అఖండ సినిమాతో సాలిడ్ ,హిట్ అందుకున్న బోయపాటి ఇప్పుడు ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

Boyapati Srinu: బాలయ్య అభిమానులకు క్షమాపణలు చెప్పిన బోయపాటి.. కారణం ఇదే..
Boyapati
Rajeev Rayala
|

Updated on: Jan 13, 2022 | 3:15 PM

Share

Boyapati Srinu: మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుల్లో ముందువరసలో ఉంటారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. రీసెంట్ గా అఖండ సినిమాతో సాలిడ్ ,హిట్ అందుకున్న బోయపాటి ఇప్పుడు ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. బాలకృష్ణ తో కలిసి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు బోయపాటి. గతంలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలను మించి అఖండ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా అఘోర పాత్రలో బాలకృష్ణ నటవిశ్వరూపం చూపించారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన సంగీతం సినిమాకు మరో ప్లేస్ పాయింట్. అని కలిపి అఖండ సినిమాకు అఖండ విజయాన్ని కట్టబెట్టాయి. ఈ సినిమాతో మొదటిసారి 100 కోట్ల క్లబ్లోకి చేరిపోయారు బాలయ్య. ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో భారీ కలెక్షన్స్ ను  కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో చిత్రం యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, బోయపాటితోపాటు చిత్ర బృందం పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బోయపాటి మాట్లాడుతూ.. బాలకృష్ణ అభిమానులకు క్షమాపణ చేప్పారు. అసలు ఈ సక్సెస్ మీట్ ను అభిమానుల మధ్య గ్రాండ్ గా చేద్దామనుకున్నామని.. కానీ కరోనా కారణంగా అభిమానులను పిలవలేక పోయామని అన్నారు. అభిమానులు ఇబ్బంది పడకూడదనే పిలవలేదని. సక్సెస్ మీట్ కు రమ్మంటే అభిమానులు ఏమాత్రం ఆలోచించకుండా వచ్చేస్తారని,ఫ్యాన్స్ బాగుండాలనే వారిని పిలవలేదని అన్నారు. ఈ కార్యక్రమానికి పిలవనందుకు బాలకృష్ణ అభిమానులు తమను క్షమించాలని బోయపాటి అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raviteja: రామారావుతో కాలు కదపనున్న బాలీవుడ్ శృంగార తార.. సాంగ్ అద్భుతంగా వచ్చిందంటోన్న దర్శక నిర్మాతలు..

Akkineni Nagarjuna: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై స్పందించిన నాగార్జున.. ఏమన్నారంటే..

Mohan Babu: గుడ్‏న్యూస్ చెప్పిన మోహన్ బాబు.. శ్రీ విద్యానికేతన్ కాలేజ్‏కీ యూనివర్సిటీ హోదా..