AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samyuktha Menon: సార్ సినిమా నుంచి తప్పించారన్న ప్రచారంపై స్పందించిన సంయుక్త.. అలాంటిదేం లేదంటూ..

కోలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్‌ మొదటిసారి నేరుగా తెలుగులో నటిస్తోన్న చిత్రం 'సార్‌'. 'తొలిప్రేమ', 'మిస్టర్‌ మజ్ను', 'రంగ్‌ దే' వంటి విభిన్న ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించిన

Samyuktha Menon: సార్ సినిమా నుంచి తప్పించారన్న ప్రచారంపై స్పందించిన సంయుక్త.. అలాంటిదేం లేదంటూ..
Sir
Basha Shek
|

Updated on: Jan 13, 2022 | 2:58 PM

Share

కోలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్‌ మొదటిసారి నేరుగా తెలుగులో నటిస్తోన్న చిత్రం ‘సార్‌’. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్‌ మజ్ను’, ‘రంగ్‌ దే’ వంటి విభిన్న ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో లాంఛనంగా ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. కాగా ఇక ఈ సినిమాను తెలుగుతోపాటు త‌మిళంలో ఏక కాలంలో నిర్మిస్తున్నారు. తమిళంలో ‘వాతి’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఇక ఈ సినిమాలో ధ‌నుష్‌కు జోడిగా మలయాళ స‌యుక్త మేన‌న్ న‌టిస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కాగా సార్ చిత్రం నుంచి సంయుక్త త‌ప్పుకున్న‌ట్లు, చిత్ర యూనిటే ఆమెను తప్పించినట్లు వార్తలు వినిపించాయి. సోషల్‌ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

కాగా తనపై జరుగుతున్న ఈ అసత్య ప్రచారం గురించి తెలుసుకున్న సంయుక్త స్పందించింది. ఇలాంటి దుష్ప్రచారాలు చేయవద్దని కోరింది. తాను సార్‌ ప్రాజెక్టు నుంచి తప్పుకోలేదని స్పష్టం చేసింది. ధనుష్‌ తో సార్ తో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. కాగా మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన సంయుక్త మేనన్ ఇటు కోలీవుడ్‌, అటు టాలీవుడ్‌లో వరుస అవకాశాలను చేజిక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఆమె భీమ్లా నాయ‌క్ చిత్రంలో రానాకు జోడిగా నటిస్తోంది. మరోవైపు కన్నడ, మలయాళ సినిమాల్లోనూ ఛాన్స్‌ లు దక్కించుకుంటోంది.

Also Read:

Raviteja: రామారావుతో కాలు కదపనున్న బాలీవుడ్ శృంగార తార.. సాంగ్ అద్భుతంగా వచ్చిందంటోన్న దర్శక నిర్మాతలు..

America: అగ్రరాజ్యంలో మరో అమానుషం.. సిక్యు క్యాబ్‌ డ్రైవర్‌పై దాడి.. తలపాగాను లాగి కింద పడేసి..

Coronavirus: అక్కడ టీకా తీసుకోని తండ్రులు పిల్లలతో గడిపే హక్కు కోల్పోతారు..