ఇంద్ర షూటింగ్‌లో ఆ సీన్ చేయనని సోనాలి బింద్రే గొడవ.. సీరియస్ అయిన దర్శకుడు..

ముద్దొచ్చే రూపం.. ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకులను అలరించింది సోనాలి బింద్రే. మోడలింగ్ నుంచి హీరోయిన్ గా మారిన సోనాలి. మరాఠీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సోనాలి. 90ల్లో ఆమె టాప్ హీరోయిన్ గా నిలిచింది.

ఇంద్ర షూటింగ్‌లో ఆ సీన్ చేయనని సోనాలి బింద్రే గొడవ.. సీరియస్ అయిన దర్శకుడు..
Indra Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 25, 2024 | 6:02 PM

సోనాలి బింద్రే .. ఒకానొక సమయంలో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ అమ్మడు. ప్రేమ దేశం సినిమా చూసిన తర్వాత ఈ అమ్మడి అందానికి కుర్రాళ్లంతా పడిపోయారు. ముద్దొచ్చే రూపం.. ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకులను అలరించింది సోనాలి బింద్రే. మోడలింగ్ నుంచి హీరోయిన్ గా మారిన సోనాలి. మరాఠీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సోనాలి. 90ల్లో ఆమె టాప్ హీరోయిన్ గా నిలిచింది. అలాగే తెలుగులో మన్మధుడు, చిరంజీవి ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాలో ఈ చిన్నది తన నటనతో ఆకట్టుకుంది.

ఇది కూడా చదవండి : Venu Swamy: వేణు స్వామితో స్టార్ హీరోయిన్ ప్రత్యేక పూజలు.. ఎవరో గుర్తుపట్టారా..?

ఇంద్ర సినిమా మెగాస్టార్ కెరీర్ లో ఓ మైలు రాయిగా నిలిచింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఫ్యాక్షన్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి ఇంద్ర సేనా రెడ్డిగా అద్భుతంగా నటించారు. అలాగే సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ గ్లామర్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. అయితే ఈ సినిమా షూటింగ్ లో దర్శకుడు సోనాలి పై సీరియస్ అయ్యారట. ఓ సీన్ చిత్రీకరణ సమయంలో సోనాలి పై దర్శకుడు ఫైర్ అయ్యారట. ఇదే విషయాన్నీ దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇది కూడా చదవండి : Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ తొలిసారి కనిపించిన సినిమా ఎదో తెలుసా.? తొలి సినిమాతోనే..

ఇంద్ర సినిమాలో సోనాలి బింద్రే వారణాసిలోని గంగా నదిలో మునిగే సీన్ చేశాం. సోనాలి ఫస్ట్ సీన్ గంగలో స్నానం చేసే సన్నివేశం చేయాలి. గంగలో మూడుసార్లు మునిగి లేవాలి అని సీన్ చెప్పా. అయితే గంగా నదిలో మునిగే సీన్ లో తాను నటించనని సోనాలిచెప్పింది. గంగా ప్రవాహంలో తాను కొట్టుకుపోతానేమో అనే భయంతో సోనాలి నీటిలో దిగడానికి ఒప్పుకోలేదు. ఎంతమంది చెప్పినా కూడా ఆమె ఆ సీన్ చేయడానికి వెనకాడింది. నా ప్రాణాలు పోతాయి అని గొడవ పెట్టుకుంది. నువ్వు ఆ సీన్ చేయకపోతే మొత్తానికే దాన్ని తీసెయ్యాలి. చేయాల్సిందే అని చెప్పా.. అయినా వినలేదు. దాంతో నువ్వు ఈ సీన్ చెయ్యాల్సిందే లేదంటే షూటింగ్ ఆపేస్తా అని వార్నింగ్ ఇచ్చారట దర్శకుడు గోపాల్. ఫైనల్ గా భయం అంటున్నవ్ కాబట్టి ఓ పని చేద్దాం.. మూడు యాంగిల్స్ లో మూడు కెమెరాలు పెడతా.. నువ్వు ఒక్కసారి మునుగు. మూడు సార్లు మునిగినట్టు చూపించవచ్చు అని చెప్తే అప్పుడు ఒప్పుకుందట. అయినా కూడా మొదటి షాట్ సరిగ్గా రాలేదట.. ఎలాగోలా కన్విన్స్ చేసి మరో షాట్ తీసారట. కానీ సోనాలి మంచి నటి అని ఆయన ప్రశంసించారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..