Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ తొలిసారి కనిపించిన సినిమా ఎదో తెలుసా.? తొలి సినిమాతోనే..
స్కిట్స్ లో సైడ్ రోల్స్ చేసే దగ్గర నుంచి టీమ్ లీడర్ గా ఎదిగాడు. గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ తో కలిసి నవ్వులు పూయించాడు సుధీర్. అలాగే యాంకర్ రష్మీతో లవ్ ట్రాక్ నడుపుతూ ప్రేక్షకులను అలరించాడు. నిజానికి ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్నప్పటికీ ఆడియన్స్ ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకున్నారు. ఇక జబర్దస్త్ నుంచి సినిమాల్లోకి అడుగు పెట్టాడు.
సుడిగాలి సుధీర్.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్. చిన్న చిన్న మ్యాజిక్ షోలు చేసుకుంటూ ప్రేక్షకులు అలరించిన సుధీర్.. ఆతర్వాత జబర్దస్త్ లో కమెడియన్ వేణు టీమ్ లో స్కిట్స్ చేశాడు. తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించాడు సుధీర్. స్కిట్స్ లో సైడ్ రోల్స్ చేసే దగ్గర నుంచి టీమ్ లీడర్ గా ఎదిగాడు. గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ తో కలిసి నవ్వులు పూయించాడు సుధీర్. అలాగే యాంకర్ రష్మీతో లవ్ ట్రాక్ నడుపుతూ ప్రేక్షకులను అలరించాడు. నిజానికి ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్నప్పటికీ ఆడియన్స్ ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకున్నారు. ఇక జబర్దస్త్ నుంచి సినిమాల్లోకి అడుగు పెట్టాడు. హీరోగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాడు. హీరోగా చేయక ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించాడు. అయితే సుధీర్ నటించిన మొదటి సినిమా ఎదో తెలుసా.. అసలు వెండితెర పై మొదటి సారి సుధీర్ కనిపించిన సినిమా ఎదో చాలా మందికి తెలియక పోవచ్చు..
ఇది కూడా చదవండి : తస్సాదీయ..! తమ్ముడు మూవీ హీరోయిన్ దుమ్మురేపిందిగా.. చూస్తే షేక్ అయ్యిపోవాల్సిందే
సుధీర్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యూత్ లో అతన్ని అభిమానించేవారు చాలా మంది ఉన్నారు. కిందిస్థాయి నుంచి వచ్చి ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు సుధీర్. అందుకే అతన్ని ప్రేక్షకులకు అంతగా ఆదరిస్తున్నారు. ఇక హీరోగా సుధీర్ సినిమాలు చేయకముందు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. అలా అడ్డా అనే సినిమాతో మొదటి సారి వెండి తెరపై కనిపించాడు సుధీర్.
ఇది కూడా చదవండి : Venu Swamy: వేణు స్వామితో స్టార్ హీరోయిన్ ప్రత్యేక పూజలు.. ఎవరో గుర్తుపట్టారా..?
సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో వేణు, ధనరాజ్ లతో కలిసి కామెడీ చేశాడు సుధీర్. ఇదే అతని మొదటి సినిమా.. ఆతర్వాత పలు సినిమాల్లో కనిపించాడు. ఆతర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు సుధీర్. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు యాంకర్ గా పలు టీవీ షోలకు హోస్ట్ గా చేస్తున్నాడు సుధీర్. సాఫ్ట్‌వేర్ సుధీర్, 3 మంకీస్ , కాలింగ్ సహశ్ర, వాంటెడ్ పండుగాడ్, గాలోడు సినిమాల్లో హీరోగా నటించాడు సుధీర్. త్వరలోనే గోట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తుంది.
సుడిగాలి సుధీర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..