Salman Khan: సల్మాన్ ఖాన్‌తో సినిమా చేయడం చాలా కష్టం.. షాకింగ్ విషయం చెప్పిన దర్శకుడు మురగదాస్
సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘సికందర్’ సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితమే పూర్తయింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు బెదిరింపులు వచ్చినప్పటికీ సల్మాన్ ఖాన్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ముందుగా చెప్పిన తేదీకే షూటింగ్ పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కాగా ఈ సినిమాలో రష్మిక మందన్న తొలిసారి సల్మాన్ ఖాన్ తో కలిసి నటిస్తోంది

సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ సికందర్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు దర్శకుడు ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ పై హత్య బెదిరింపులు గురించి దేశం మొత్తం తెలిసిన న్యూసే.. లారెన్స్ బిష్ణోయ్ నుండి పదే పదే హత్య బెదిరింపుల కారణంగా సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేయడం గురించి మురగదాస్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అసలు సల్మాన్ తో సినిమా ఎందుకు చేస్తున్నారు.? అనేదని పై కూడా మురగదాస్ మాట్లాడారు. ఒక ప్రముఖ వార్తా సంస్థ కోసం సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేయడం గురించి ఎ.ఆర్ మురగదాస్ వివరంగా మాట్లాడారు. అలాగే అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సికందర్ సినిమా చాలా పెద్దది. మేము తరచుగా సెట్‌లో 10,000 నుండి 20,000 మందితో సన్నివేశాలనుచేసేవాళ్ళం. ఇంత పెద్ద జనసమూహాన్ని నిర్వహించడానికి అధిక భద్రత అవసరం. మా షెడ్యూల్ కూడా చాలా టఫ్ గా ఉంటుంది.. సల్మాన్ ఖాన్ కు వచ్చిన హత్య బెదిరింపులతో అది మరింత వేడెక్కింది అని అన్నారు. అలాగే బెదిరింపుల నేపథ్యంలో షూటింగ్ షెడ్యూల్‌ను ఎలా ప్రభావితం చేశాయో ఆయన ప్రస్తావించారు. ఆ తర్వాత భద్రతను కట్టుదిట్టం చేశారని చెప్పారు మురగదాస్. సెట్లలోని అన్ని అదనపు వస్తువులను తనిఖీ చేయడానికి ప్రతిరోజూ 2, 3 గంటలు పడుతుంది. మా రోజులో ఎక్కువ సమయం అక్కడి రిజిస్ట్రేషన్లు , చెకింగ్ కే పట్టింది అని అన్నారు మురగదాస్. మేము తరచుగా చిత్రీకరణ ఆలస్యంగా ప్రారంభించి.. ఆలస్యంగా పూర్తి చేసేవాళ్ళం. షూటింగ్ లొకేషన్ చాలా సానుకూల వైబ్ ఉండేది అని అన్నారు.
సల్మాన్ ఖాన్‌తో సినిమా చేయడం గురించి మాట్లాడుతూ.. ఈ కథకు అభిమానులకు ఇష్టమైన సూపర్‌స్టార్ అవసరమని అన్నారు. సల్మాన్ సర్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారు. ఆయన వ్యక్తిత్వం ఈ పాత్రకు, కథకు బలాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత, తాను ఎందుకు ఉత్తమ ఎంపికో మీకు అర్థమవుతుందని ఏఆర్ మురుగదాస్ అన్నారు. ఇక ఈ సినిమా పక్క హిట్ అవుతుందని అభిమానులు అంటున్నారు. అలాగే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..