Viral: ‘శీను వాసంతి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ సోదరిగా నటించిన ప్రియ ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా..?

మలయాళంలో మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు పద్మప్రియ. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఆమె నటించారు.

Viral: 'శీను వాసంతి లక్ష్మి'లో ఆర్పీ పట్నాయక్ సోదరిగా నటించిన ప్రియ ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా..?
Padmapriya as Vasanthi in the film ‘Seenu Vasanthi Lakshmi’ (2004)
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 11, 2023 | 7:31 PM

ఆర్పీ పట్నాయక్ ప్రధాన పాత్రలో 2004 లో వచ్చిన ప్రయోగాత్మక చిత్రం శీను వాసంతి లక్ష్మి విమర్శకులు ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.  వాసంతియుం లక్ష్మియుం పిన్నే నిజానుం అనే మలయాళ సినిమా నుంచి స్పూర్తి పొంది ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆర్పీ పట్నాయక్ అంధుడిగా కనిపిస్తారు. ఈ మూవీలో శ్రీను చెల్లెలు స్రవంతి పాత్రలో పద్మ ప్రియ జానకిరామన్ అనే నటి కనిపించింది. ఆమెకు ఇదే తొలి సినిమా. ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించిన ప్రియ.. ఆడియెన్స్‌ను మెప్పించి.. ప్రశంసలు అందుకున్నారు.

కానీ ఆ తర్వాత ఎందుకో ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. 2010లో వచ్చిన అందరి బంధువయ, 2017లో వచ్చిన పటేల్ సర్ సినిమాల్లో మాత్రమే నటించారు ప్రియ. అలాగని ఆమె నటనను నుంచి దూరంగా ఏం లేరు. ఇతర భాషల్లో వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. 2017 నుంచి 2021 వరకు స్మాల్ బ్రేక్ ఇచ్చారు. గత ఏడాది వండర్ విమెన్ అనే ఇంగ్లీష్ సినిమాలో మెరిశారు.

శీను వాసంతి లక్ష్మి సినిమా వచ్చి దాదాపు రెండు దశాబ్ధాలు అవుతున్నా.. ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో అలానే ఉన్నారు పద్మప్రియ.  ఆమె ప్రజంట్ పిక్స్ చూసినవారు స్టన్ అవుతున్నారు. సాంప్రదాయ నృత్యంపై ఆమెకు మంచి పట్టు ఉంది. అలానే పుస్తకాలు కూడా చదువుతారు. కొత్త ప్రదేశాలు చూసేందుకు ఆసక్తి చూపుతారు. తన ఇంటి పెరట్లో మొక్కలు పెంచడం పద్మ ప్రియకు ఎంతో ఇష్టం. ఈ నటీమణి మున్ముందు మరిన్ని సినిమాలతో అలరించాలని కోరుకుందాం.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.