Rakesh master: రాకేష్ మాస్టర్ ఫేవరేట్ హీరో అతడే.. ఆయన డాన్స్ అంటే చాలా ఇష్టమట
ఇటీవలే ఆయన విశాఖపట్నం వెళ్లి షూటింగ్ లో పాల్గొన్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. రాకేష్ మాస్టర్ గురించి తెలియని వారు ఉండరు. ఓ డ్యాన్స్ షోలో ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి.

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది. అనారోగ్య సమస్యతో బాధపడుతూ రాకేష్ మాస్టర్ నిన్న ఆదివారం కన్నుమూశారు. ఇటీవలే ఆయన విశాఖపట్నం వెళ్లి షూటింగ్ లో పాల్గొన్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. రాకేష్ మాస్టర్ గురించి తెలియని వారు ఉండరు. ఓ డ్యాన్స్ షోలో ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. కెరీర్ బిగినింగ్ లో రాకేష్ డాన్స్ క్లాస్ ను నిర్వహించేవారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పలు సినిమాలకు డాన్స్ కొరియోగ్రాఫర్ గా పని చేసిన రాకేష్ మాస్టర్, రవితేజ, ప్రభాస్, మహేష్ బాబు, రాజేంద్రప్రసాద్, హరికృష్ణ లాంటి హీరోలకు కొరియోగ్రాఫ్ చేశారు. అలాగే టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ కొరియోగ్రాఫర్స్ గా రాణిస్తున్న వారు రాకేష్ మాస్టర్ శిష్యులే..
ఇక రాకేష్ మాస్టర్ ముక్కుసూటి తనంతో ఆయన బాగా పాపులర్ అయ్యారు. గతంలో ఓ డాన్స్ షోలో ప్రభుదేవా కు సవాల్ విసిరి హాట్ టాపిక్ అయ్యారు. తెలుగు డాన్స్ షోకు తెలుగు వాళ్ళను జడ్జ్ లుగా ఉంచాలని ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి.
అలాగే స్టార్ క్రొయోగ్రాఫర్ గా రాణిస్తున్న తన శిష్యుడు శేఖర్ మాస్టర్ తో విభేదాల గురించి కూడా ఆయన పలు సందర్భాల్లో స్పందించారు. ఆ మధ్య కొన్ని ఇంటర్వ్యూల్లో శేఖర్ మాస్టర్ పై ఆరోపణలు చేశారు రాకేష్ మాస్టర్. ఈ విభేదాల పై శేఖర్ మాస్టర్ పెద్దగా స్పందించలేదు. ఇక ఒకానొక ఇంటర్వ్యూలో తన ఫెవరెట్ డాన్సర్ గురించి మాట్లాడారు. ఆయనకు అల్లు అర్జున్ డాన్స్ అంటే చాలా ఇష్టమని అన్నారు రాకేష్ మాస్టర్. బన్నీ డాన్స్ చాలా స్టైలిష్ గా ఉంటాయని.. అందుకే బన్నీ డాన్స్ అంటే తనకు ఇష్టమని అన్నారు. అలాగే చిరంజీవి డాన్స్ చాలా ఇష్టం అన్నారు రాకేష్ మాస్టర్. ఇక ఎన్టీఆర్ నటన అద్భుతం అన్ని కొనియాడారు.
Allu Arjun



