Upasana Konidela: పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం..! ఏంటో ప్రకటించిన మెగా కోడలు..

Upasana Konidela: పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం..! ఏంటో ప్రకటించిన మెగా కోడలు..

Anil kumar poka

|

Updated on: Jun 19, 2023 | 1:27 PM

అపోలో మేనేజింగ్ డైరెక్టర్స్‏లో ఒకరిగా కొనసాగుతున్న ఉపాసన.. ఇటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంటారు. అంతేకాకుండా.. చెర్రీతో కలిసి సినిమా ఈవెంట్లలో సందడి చేస్తుంటారు. అంతేకాకుండా.. అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటారు.

అపోలో మేనేజింగ్ డైరెక్టర్స్‏లో ఒకరిగా కొనసాగుతున్న ఉపాసన.. ఇటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంటారు. అంతేకాకుండా.. చెర్రీతో కలిసి సినిమా ఈవెంట్లలో సందడి చేస్తుంటారు. అంతేకాకుండా.. అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటారు. కేవలం ఫ్యామిలీ విషయాలే కాకుండా.. ప్రజలకు అవసరమైన అంశాలు.. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను సైతం నెట్టింట షేర్ చేసుకుంటారు. ఇదిలా ఉంటే.. త్వరలోనే చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత ఉపాసన తల్లికాబోతుండడంతో వారసుడి కోసం మెగా ఫ్యామిలీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 14న చరణ్, ఉపాసన పెళ్లి రోజు. వీరి వివాహం జరిగి ఇప్పటివరకు 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలలో ఓ వీడియో షేర్ చేసారు. తాజాగా షేర్ చేసిన వీడియోలో స్టెమ్ సెల్ బ్యాంకింగ్‌ .. అంటే.. పుట్టబోయే బిడ్డకు సంబంధించిన కోర్డ్ బ్లడ్‏ను దాచుకుంటున్న్టలు తెలిపింది. స్టెమ్ సెల్ బ్యాంకింగ్ లో పుట్టిన బిడ్డకు సంబంధించిన బొడ్డు తాడును దాచుకోవడం వలన పెద్దయ్యాక వారికేమైనా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు వాటి చికిత్సకు బొడ్డు తాడును ఉపయోగిస్తారని తెలిపింది. ఇక ఇదే విషయాన్ని గతంలో మహేష్ బాబు సతీమణి నమ్రత సైతం ప్రస్తావించారు. తమ పిల్లలద్దిరీ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. మన దేశంలో ఈ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ గురించి కొన్నేళ్ల నుంచి ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. అయితే కాస్త ఖర్చుతో కూడుకున్నది కావడంతో కొంత మందికి మాత్రమే పరిమితమవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!