Viral Video: ఫేస్‌బుక్‌ లైవ్‌లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం..! మహిళతో సహజీవనమే కారణమా..

Viral Video: ఫేస్‌బుక్‌ లైవ్‌లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం..! మహిళతో సహజీవనమే కారణమా..

Anil kumar poka

|

Updated on: Jun 19, 2023 | 1:47 PM

కామెడీ షో 'ది కపిల్ శర్మ షో' గురించి తెలియని వారు ఉండరు. ప్రముఖులతో సైతం నవ్వులు తెప్పించే ఈ షో ద్వారా కపిల్ శర్మ ఫేమస్ అయ్యారు. మరో హాస్యనటుడు తీర్థానంద రావు కూడా ఈ షోతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా కపిల్ శర్మ కో స్టార్ తీర్థానంద రావు ఆత్మహత్యాయత్నం చేశారు.

కామెడీ షో ‘ది కపిల్ శర్మ షో’ గురించి తెలియని వారు ఉండరు. ప్రముఖులతో సైతం నవ్వులు తెప్పించే ఈ షో ద్వారా కపిల్ శర్మ ఫేమస్ అయ్యారు. మరో హాస్యనటుడు తీర్థానంద రావు కూడా ఈ షోతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా కపిల్ శర్మ కో స్టార్ తీర్థానంద రావు ఆత్మహత్యాయత్నం చేశారు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో పాయిజన్ తాగి బలవన్మరణానికి యత్నించారు. వెంటనే విషయం తెలుసుకున్న స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న తీర్థానందరావును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నారు. అయితే తనతో సహజీవనం చేస్తున్న మహిళ డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తోందని తీర్థానంద రావు ఆరోపిస్తున్నారు. తన డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని.. ఆమె వల్ల రూ. 4 లక్షల అప్పులు చేశానని చెప్పుకొచ్చారు. తనకు ఏదైనా జరిగితే ఆమెనే బాధ్యత వహించాలన్నారు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ.. గతేడాది అక్టోబర్ నుంచి తాను ఓ మహిళతో లివ్‌-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నానని ఆమె తనను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తోందని తన నుంచి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆమె వల్ల లక్షల రూపాయలు అప్పు చేశానని అన్నారు. అయితే ఆ తర్వాత లైవ్ వీడియోను డిలీట్ చేసినట్లు సమాచారం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!

Published on: Jun 19, 2023 12:54 PM