AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG High Court Jobs 2026: జిల్లా కోర్టుల్లో 353 ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగాలు.. 7వ తరగతి, ఇంటర్‌ పాసైతే చాలు!

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్‌ సబార్డినేట్‌, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3, రికార్డ్‌ అసిస్టెంట్‌ తదితర ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర హైకోర్టు (TGHC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 353 ఉద్యోగాలను భర్తీ చేయనుంది..

TG High Court Jobs 2026: జిల్లా కోర్టుల్లో 353 ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగాలు.. 7వ తరగతి, ఇంటర్‌ పాసైతే చాలు!
Telangana High Court Office Subordinate Jobs
Srilakshmi C
|

Updated on: Feb 05, 2026 | 1:51 PM

Share

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్‌ సబార్డినేట్‌, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3, రికార్డ్‌ అసిస్టెంట్‌ తదితర ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర హైకోర్టు (TGHC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 353 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 13, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ జిల్లా కోర్టుల పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..

  • స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3 పోస్టుల సంఖ్య: 35
  • జూనియర్ అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్య: 159
  • టైపిస్ట్‌ పోస్టుల సంఖ్య: 42
  • ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్య: 61
  • ఎగ్జామినర్‌ పోస్టుల సంఖ్య: 49
  • కాపీయిస్ట్‌ పోస్టుల సంఖ్య: 63
  • రికార్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్య: 36
  • ప్రాసెస్‌ సర్వర్‌ పోస్టుల సంఖ్య: 95
  • ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల సంఖ్య: 319

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టును అనుసరించి 7వ తరగతి, ఇంటర్‌, డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీనితోపాటు అభ్యర్ధులకు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయోపరిమితి తప్పనిసరిగా 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ముగింపు గడువులోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఒక్కో పోస్టుకు జనరల్‌, బీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు రూ.400 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు రూ.32,810 నుంచి రూ.96,890 వరకు, జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.24,280 నుంచి రూ.72,850 వరకు, ఎగ్జామినర్‌, కాపియిస్ట్‌, ప్రాసెస్‌ సర్వర్‌ పోస్టులకు రూ.22,900 నుంచి రూ.69,150 వరకు, రికార్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ. 22,240 నుంచి రూ.67,300 వరకు, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులకు రూ.19,000 నుంచి రూ.58,850 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలకు ఈ కింది లింక్‌పై క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ జిల్లా కోర్టుల పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

బయట ఫుడ్ తినే అలవాటు ఉందా.? ఇది చూస్తే జన్మలో మళ్లీ ముట్టుకోరు
బయట ఫుడ్ తినే అలవాటు ఉందా.? ఇది చూస్తే జన్మలో మళ్లీ ముట్టుకోరు
మహిళల కోసం మరో కొత్త పథకం.. అవన్నీ ఫ్రీ
మహిళల కోసం మరో కొత్త పథకం.. అవన్నీ ఫ్రీ
ఆ తప్పు చేయకపోతే ఇప్పటికీ స్టార్ హీరోగా ఉండేవాడు..
ఆ తప్పు చేయకపోతే ఇప్పటికీ స్టార్ హీరోగా ఉండేవాడు..
భలే ఛాన్స్.. జిల్లా కోర్టుల్లో 353 ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగాలు
భలే ఛాన్స్.. జిల్లా కోర్టుల్లో 353 ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగాలు
ఇల్లు చూడాలంటే నెల అద్దె కట్టాలా.. బెంగళూరులో సెక్యూరిటీ గార్డు..
ఇల్లు చూడాలంటే నెల అద్దె కట్టాలా.. బెంగళూరులో సెక్యూరిటీ గార్డు..
భారత్‌తో మ్యాచ్ ఆడకున్నా.. ఈజీగా పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది.!
భారత్‌తో మ్యాచ్ ఆడకున్నా.. ఈజీగా పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది.!
ఆఫీస్ లేదు.. బాస్‌ అనే బాధ అస్సలు ఉండదు.. తిరుగులేని బిజినెస్ ఇది
ఆఫీస్ లేదు.. బాస్‌ అనే బాధ అస్సలు ఉండదు.. తిరుగులేని బిజినెస్ ఇది
గోల్డ్, సిల్వర్ రెండింటిలోనూ ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్ మంచిదేనా.?
గోల్డ్, సిల్వర్ రెండింటిలోనూ ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్ మంచిదేనా.?
కృష్ణకు ఇష్టమైన తెలుగు హీరో.. అతడు న్యాచురల్ ఆర్టిస్ట్..
కృష్ణకు ఇష్టమైన తెలుగు హీరో.. అతడు న్యాచురల్ ఆర్టిస్ట్..
ఒరేయ్ ఆజామూ.! నీ రికార్డు తృటిలో మిస్..
ఒరేయ్ ఆజామూ.! నీ రికార్డు తృటిలో మిస్..