
సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు చాలా మంది నటీనటులు చిన్న చితకా పనులు చేసిన వారే. పొట్ట కూటి కోసం ఏవేవో ఉద్యోగాలు చేసిన వారే. ఈ టాలీవుడ్ కమెడియన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కమెడియన్ ఇప్పుడు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. కమెడియన్ గా, సహాయక నటుడిగా ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. అయితే సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు చేతికొచ్చిన పని చేశాడీ కమెడియన్. పొట్ట కూటి కోసం హైదరాబాద్‌లో సిగ్నల్స్ దగ్గర స్కూల్ బ్యాగులు, గొడుగులు అమ్మాడు. కోఠిలో రోడ్లపై నిలబడి రకరకాల వస్తువులు విక్రయించాడు. హైదరాబాద్ లోని ఫేమస్ అయిన చార్మినార్, కామత్, ఉడిపి తదితర హోటళ్లలో పనిచేశాడు. క్యాటరింగ్ వర్క్ కూడా చేశాడు. పాత్రలు కడిగాడు. చివరికీ బాత్రూమ్స్ కడిగాడు.అయితే ఇదే సమయంలో తన మిమిక్రీ ట్యాలెంట్ తో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కామెడీ పంచులతో అదరగొట్టాడు. ముఖ్యంగా లేడీ గెటప్పులతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైపోయాడు. ఇప్పుడు జబర్దస్త్ టాప్ కమెడియన్లలో ఒకరిగా వెలుగొందుతోన్న అతను సినిమాల్లోనూ మెరుస్తున్నాడు. అంతేకాదు ఈ నటుడికి ఇప్పుడు కోట్లాది ఆస్తులున్నాయని తెలుస్తోంది. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరనుకుంటున్నారా?
ఇప్పుడంటే జబర్దస్త్ లో లేడీ కమెడియన్లు కూడా కనిపిస్తున్నారు. కానీ ఒకప్పుడు పురుషులే మహిళల గెటప్ లు వేసుకునేవారు. అలా లేడీ గెటప్స్ తోనే ఫేమస్ అయిన కమెడియన్ కొమురక్క అలియాస్ కుమార్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతను తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు తాను పడిన ఇబ్బందులు, కష్టాలను అందరితో పంచుకుని ఎమోషనల్ అయ్యాడు.
‘నా మిమిక్రీ ట్యాలెంట్ తోనే నాకు జబర్దస్త్ లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి. మా నాన్నకు ఇరవై ఎకరాల భూమి ఉంది. కానీ ఆయన వాటిని అమ్మేశాడు. చివరికీ కేవలం 5 ఎకరాలు మాత్రమే ఉంది. అయితే విమానాశ్రయం రాకతో ఇప్పుడు ఆ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పుడు మా భూములు కోట్లు పలుకుతున్నాయి’ అని చెప్పుకొచ్చాడు కుమార్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.